విద్యార్ధులకు కాంగ్రెస్ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్.. బ్రేక్ ఫాస్ట్‌గా బిర్యానీ !!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సర్కారు తీపికబురు ప్రకటించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని స్కూళ్లలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందించనుంది. ఇందుకోసం సుమారు రూ.400 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పేద విద్యార్థులకు పోషకాహారం అందించడంతో పాటు స్కూళ్లలో హాజరుశాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ పథకం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
కాగా 2026-27 విద్యాసంవత్సరం నుంచి పాఠశాలల్లో ఈ అల్పాహారం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది. అంతే కాకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 1.7 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుంది. యూనిఫామ్స్ కూడా అందించే విషయంపై కూడా ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ మెనూ..
- ఇక ఈ పథకం కింద వారంలో మూడు రోజులు అన్నంతో తయారుచేసే పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడీ పెట్టనున్నారు.
- మరో రెండు రోజులు ఉప్మా వంటి వాటిని అందించాలని అధికారులు ప్రతిపాదించారు.
ఇక ఇప్పటికే ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 17 లక్షల మందికి మధ్యాహ్న భోజన పథకం అందుతోంది. ఇప్పుడు ఇందుకు అదనంగా టిఫిన్ కూడా జత చేయడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. విద్యార్ధుల పట్ల సర్కారు చూపిస్తున్న చొరవ పట్ల విద్యార్ధుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ( కేజీబీవీ ) లను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో మొత్తం 495 కేజీబీవీ ఉండగా.. 2025-26 విద్యా సంవత్సరానికి గాను సుమారు 120 కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థినులు 10వ తరగతి తర్వాత చదువును ఆపివేయకుండా.. కొనసాగించేందుకు దోహదపడుతుందని వివరిస్తున్నారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications