కయ్యానికి కాలు దువ్వి: తెలంగాణలో వివాదాస్పద ఎన్‌పీఆర్‌కు గ్రీన్ సిగ్నల్: జనాభా లెక్కింపుతో పాటే..!

హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గట్టిగా విభేదించే పార్టీల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటి. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కలుపుకొని ఎన్డీఏ, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేయని ప్రయత్నమంటూ లేదు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో.. కేసీఆర్ మూడో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు ప్రయత్నాలు అటకెక్కినట్టయింది.. తాత్కాలికంగా.

పౌరసత్వ సవరణకు మాత్రమే వ్యతిరేకం..

పౌరసత్వ సవరణకు మాత్రమే వ్యతిరేకం..

బీజేపీ, బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమలు చేయదలిచిన పథకాలు, ఇతర కార్యక్రమాల పట్ల ముందు నుంచీ వ్యతిరేకత ప్రదర్శిస్తూనే వస్తోంది కేసీఆర్ సర్కార్. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరనమోదు కార్యక్రమాలను వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాడుతామనీ ఆయన కొద్దిరోజుల కిందటే ప్రకటించారు కూడా.

జాతీయ జనాభా రిజిస్టర్‌ అమలుకు నోటిఫికేషన్..

జాతీయ జనాభా రిజిస్టర్‌ అమలుకు నోటిఫికేషన్..

ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ సర్కార్ జాతీయ జనాభా రిజిస్టర్‌ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఒక్క పౌరసత్వ సవరణ చట్టాన్ని మాత్రమే వ్యతిరేకిస్తోందని, మిగిలిన జాతీయ పౌర నమోదు పట్ల గానీ, జాతీయ జనాభా రిజిస్టర్‌ను గానీ అమలు చేయడంలో పెద్దగా వ్యతిరేకత ప్రదర్శించట్లేదు. దీనికి నిదర్శనగా.. జాతీయ జనాభా రిజిస్టర్‌ను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పదేళ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కింపులతో పాటుగా జాతీయ జనాభా రిజిస్టర్‌ను కూడా అమలు చేయాలని ఆదేశించింది.

24 అంశాలపై ప్రశ్నలు..

24 అంశాలపై ప్రశ్నలు..

మొత్తం 24 అంశాలపై ప్రజల నుంచి సమాధానాలను రాబట్టుకుంటారు ఎన్యుమరేటర్లు. ఇంటి నంబరు, కుటుంబ సభ్యుల సంఖ్య, ఓ ఇంట్లో ఎంతమంది నివాసం ఉంటున్నారు, మంచినీటి వసతి, మురుగునీటి పారుదల సౌకర్యం.. వంటి 24 అంశాలపై ప్రశ్నలు వేస్తారు. వాటి గురించి ఆరా తీస్తారు. దీనితో పాటుగా- ఎన్యుమరేటర్లు జాతీయ జనాభా రిజిస్టర్‌ను కూడా నమోదు చేయాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+