Telangana: చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Telangana: తెలంగాణ రాష్ట్ర సర్కారు చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. "వర్కర్ టూ ఓనర్" పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఈ పథకం అమలుపై హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ పథకంలో భాగంగా గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్ ను ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నారు. తొలుత ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సిరిసిల్ల జిల్లాను ఎంచుకున్నారు. ఆ జిల్లాలో 5 వేల మంది నేత కార్మికులు ఉండగా.. 2 వేల మంది పేదరికంలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
తొలి దశలో 1,104 మంది కార్మికులను ఎంపిక చేసి వారిని ఓనర్లుగా మార్చేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఇందులో ఒక్కో యూనిట్ విలువ రూ.8లక్షలు ఉండగా.. అందుసో 50 శాతం సబ్సిడీ, 40 శాతం బ్యాంక్ లోన్, 10శాతం లబ్ధిదారుడు చెల్లించేలా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

ఎన్నికల కోడ్ ముగిశాక "వర్కర్ టూ ఓనర్" పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని టెస్కో జనరల్ మేనేజర్ అశోక్ రావు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో కార్మికుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. పవర్ లూమ్స్ సరఫరా కోసం ప్రభుత్వం కొన్ని కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. మరో వారంలో ఈ విషయంపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications