తమిళిసై సంచలనం: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ, వీరి పేర్లే
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన గవర్నర్ కోటా మ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో ఎంపిక చేయడానికి అర్హతలు అడ్డు వస్తున్నాయంటూ.. ఎంపిక ప్రక్రియను పక్కన పెట్టారు తమిళిసై సౌందరరాజన్. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎంపిక చేసేందుకు సరైన సమాచారం లేదన్నారు. ఆర్టికల్ 171(5) ప్రకారం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎంపిక జరగలేదన్నారు.

దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వీళ్లిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు, సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదని గవర్నర్.. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ ద్వారా గవర్నర్ తెలియజేశారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)
చెప్తోందని గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్ స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయకూడదో ప్రజాప్రాతినిథ్య చట్టంలో స్పష్టంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అనర్హత కిందకు రారని చెప్పేలా.. ఇంటెలిజెన్స్ సహా ఏ ఇతర సంస్థల నివేదికలు లేవని తెలిపారు. మంత్రివర్గ సిఫారసుతో అన్ని అంశాలను జత చేయలేదన్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి పేర్లను ఆమోదిస్తే ఆయా రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు లభించబోదన్నరు. సరైన వ్యక్తులకు అవకాశాలు నిరాకరించినట్లవుతుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను తిరస్కరించాలని మంత్రి మండలి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు.
గవర్నర్ కోటాలో తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిలిసై సెప్టెంబర్ 19వ తేదీనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించగా.. కానీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య ఇప్పుడిప్పుడే సత్ససంబంధాలు ఏర్పడుతున్నట్లు కనిపించినా.. ఈ పరిణామంతో మళ్లీ ఈ రెండు కార్యాలయాల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications