హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్... తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అగస్టు 26 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి లేఅవుట్ క్రమబద్దీకరణ(LRS)కు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ శాఖ మంగళవారం(సెప్టెంబర్ 1) ఉత్తర్వులు జారీ చేసింది.

Recommended Video

We Will Not Accept Anyone Apart From Gandhi's Family -Telangana Congress Leader Jagga Reddy

తాజా ఉత్తర్వులు అగస్టు 31 నుంచి అమలులోకి వస్తాయని మున్సిపల్ శాఖ తెలిపింది. హెచ్ఎండీఏతో పాటు అన్ని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు,మున్సిపల్ కార్పోరేషన్లు,మున్సిపాలిటీలు,గ్రామ పంచాయితీల పరిధిలోని లేఅవుట్లకు ఈ అవకాశం వర్తించనుంది. రెగ్యులైరేజేషన్ కోసం దరఖాస్తుదారులు సేల్ డీడ్/టైటిల్ డీడ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన గడువు దాటిన ఎట్టి పరిస్థితుల్లోనూ రెగ్యులరైజేషన్ వర్తించదు.ఆన్‌లైన్ దరఖాస్తు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్లాట్ ఓనర్లు దరఖాస్తుతో పాటు రిజిస్ట్రేషన్ కింద రూ.1000 చెల్లించాలి. లేవుట్ ఓనర్లు రూ.10వేలు రుసుం చెల్లించాలి.

Telangana govt announces Layout Regularisation Scheme for unapproved plots

లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది.

కుంటలు,నాలాలు,చెరువులు,శిఖం భూములు వంటి గ్రీన్ బఫర్ జోన్‌లో లేఅవుట్లకు రెగ్యులరైజేషన్ వర్తించదు.

10 హెక్టార్లు లేదా అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుకు 30మీటర్ల దూరంలో లేఅవుట్ ఉండాలి.

10 హెక్టార్ల లోపు విస్తీర్ణంలో ఉన్న కుంటలు,శిఖం భూములకు 9మీటర్ల దూరంలో ఉండాలి.

కెనాల్స్,వాగులకు 9మీ. దూరంలో ఉండాలి.

నాలాలకు 2మీ. దూరంలో ఉండాలి.

విమానాశ్రయ సమీపంలో రిస్ట్రిక్ట్ చేయబడిన జోన్ లోపల లేఅవుట్ అభివృద్ధి కార్యకలాపాల కోసం
లేదా రక్షణ ప్రాంతాల బౌండరీ నుండి 500 మీటర్ల దూరంలో లేఅవుట్ కోసం సంబంధిత రక్షణ,విమానాశ్రయ అధికారుల అనుమతి పొందాలి.

English summary
To legalise open plots in unapproved layouts in the state, the telangana government has announced layout regularisation scheme(LRS) on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X