మరో విడత కొత్త పెన్షన్ల మంజూరు, లబ్దిదారుల జాబితా- పంపిణీ ముహూర్తం..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేస్తూ తాజా గా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 4,63,857 మందికి చేయూత పథకం కింద పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వం మరోసారి పెన్షన్ల సంఖ్య పెంచింది. 11,275 మందిని అర్హులుగా గుర్తించటంతో వారికి మంజూరు పత్రాలు ఇవ్వాలని డిసైడ్ అయింది. అయితే, ఈ నెల 19న పంపిణీ కావాల్సిన కొత్త పెన్షన్లు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసారు. దీంతో.. అర్హులకు క్రమేణా పెన్షన్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అమలు చేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ పథకం కింద కొత్తగా మరో 11,275 మందికి పింఛన్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే 4,63,857 మందికి చేయూత పథకం కింద పింఛన్లు మంజూరు చేసింది. ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులకు కొత్తగా చేయూత పింఛన్ల మంజూరుకు సంబంధించిన ఫైలుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థిశాఖ మంత్రి సీతక్క గురువారం సంతకం చేశారు. తాజాగా మంజూరైన వాటిలో ఫైలేరియా బాధితులకు 5,895, ఎయిడ్స్ బాధితులకు 3,024, డయాలసిస్ రోగులకు 2,356 పింఛన్లు ఇవ్వనున్నారు. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లబ్థిదారుల ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేయనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయంతో
ప్రభుత్వం తొలుత తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 19న ఇందిరా గాంధీ జన్మదినం నాడు కొత్త పెన్షన్లతో పాటుగా ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేయాలని భావించారు. అయితే, ప్రభుత్వం ఈ నిర్ణయంలో మార్పు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, కొత్తగా మంజూరైన లబ్ధిదారులతో కలిపి మొత్తం 4,63,857 మందికి చేయూత పింఛన్లను అందించనున్నారు. వృద్ధులు, వితంతు వులు, దివ్యాంగులు తదితర అర్హులైన వర్గాలకు ఈ పెన్షన్లు ఆర్థికంగా తోడ్పాటు అందించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే, ముందుగా ప్రకటించిన తేదీ మారడంతో లబ్ధి దారుల్లో కొంత నిరీక్షణ నెలకొన్నప్పటికీ, నవంబర్ 26 నుంచి పంపిణీ చేస్తామనే ప్రభుత్వ తాజా ప్రకటనతో మహిళలు, పెన్షన్‌దారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













Click it and Unblock the Notifications
