ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త - మంజూరు, ముహూర్తం ఖరారు..!!

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు బిగ్ న్యూస్. ఇళ్ల మంజూరు ప్రక్రియ పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలువురు లబ్దిదారులకు కొత్త ఇళ్ల మంజూరు కోసం వేచి చూస్తున్నారు. బిల్లుల చెల్లింపు విషయంలోనూ కొన్ని ప్రాంతాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు..బిల్లుల చెల్లింపు .. పంపిణీ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసారు. లబ్దిదారులకు హామీ ఇచ్చారు.

ఇందిరమ్మ ఇళ్ల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇళ్ల మంజూరు కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లబ్దిదారులు కొత్త ఇళ్ల కోసం వేచి చూస్తున్నారు. కాగా, చాలా మందికి ఇప్పటికీ ఇళ్లు మంజూరు కాలేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం వారంతా వేచి చూస్తున్నారు. దశల వారీగా ప్రభుత్వం వీటిని మంజూరు చేస్తోంది. గ్రామీణ ప్రాంతంలోని లబ్దిదారులకు ప్రాధాన్యత ఇస్తూ.. ముందుగా గ్రామాల్లో ఇళ్లను మంజూరుకు నిర్ణయించింది. అలా చేసిన వాటిల్లో చాలా మంది గృహ ప్రవేశాలు పూర్తి చేసారు. అదే విధంగా పలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ప్రభుత్వం లబ్దిదారులకు విడతల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. లబ్దిదారుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తోంది. దీంతో.. పెండింగ్ లో ఉన్న లబ్దిదారులకు ఇళ్ల మంజూరు పైన మంత్రి పొంగులేటి స్పష్టత ఇచ్చారు.

telangana-govt-big-announcement-over-indiramma-houses-allocation-here-the-details

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఒక విడత ఇళ్ల మంజూరు పూర్తవ్వగా.. మరో మూడు విడతలు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రతీ ఏడాది ఏప్రిల్‌లో కొత్త ఇళ్ల మంజూరు జాబితా ప్రకటిస్తామని చెప్పారు. అదే విధంగా తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా.. 52 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు పూర్తయ్యాయని వివరించారు. ఇంకా 3 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, వచ్చే వర్షాకాలంలోపు తొలి విడత ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని తెలి పారు. తొలి దశలో గ్రామాల్లోని ప్రజలకు ఇళ్లను మంజూరు చేశామని, రెండో దశలో పట్టణాల్లోని ప్రజలకు కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, గ్రామాల్లో స్థలాలను గుర్తించి వాటిని నిరుపేదలకు ఇస్తామని, 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణ పరిమితికి మంచి ఇళ్లు నిర్మించుకున్నవారికి మినహాయింపులు ఇస్తామని పొంగులేటి స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+