తెలంగాణలో ఒంటిపూట బడులు: వేసవి సెలవుల ఆరంభ తేదీ వెల్లడి

Half Day Schools in Telangana: తెలంగాణలో ఎండ తీవ్రత అంచనాలకు మించి పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటోన్న విద్యుత్ కోతలు దీనికి తోడవుతోన్నాయి. ఫలితంగా ఉక్కపోతకు గురి అవుతున్నారు జనం.

మార్చి మొదటివారంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందంటూ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏప్రిల్- మే నెలల్లో పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉండే అవకాశాలు లేకపోలేదు. ఆదిలాబాద్‌లో సోమవారం నాడు గరిష్ట 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Telangana govt declares half day schools from March 15 and Summer vacation April 23 onwards

పొడి వాతావరణం కారణంగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోందని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బంగాళాఖాతం మీదుగా వీస్తోన్న వేడి గాలుల వల్ల పొడి వాతావరణం నెలకొంటోంది. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని, మార్చి మూడోవారంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరువ కావొచ్చని అంచనావేసింది.

వాతావరణ మార్పు ప్రభావం సైతం దీనికి తోడైనట్లు చెబుతున్నారు. అటవీ విస్తీర్ణం ఆందోళనకరంగా తగ్గిపోతోండటం, పట్టణీకరణ శరవేగంగా కొనసాగుతోండటం, గ్రీన్‌హౌస్, వాయు ఉద్గారాలు వంటి అంశాలు.. వేడిగాలుల ప్రభావాన్ని తీవ్రతరం చేస్తోన్నాయంటూ వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తోన్నారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఒంటిపూట బడుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మధ్యహ్నపు ఎండ తీవ్రత గరిష్ఠస్థాయికి చేరుకునే సమయానికి వాళ్లంతా ఇళ్లకు చేరేలా టైమింగ్స్‌ను సవరించింది. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

మార్చి 15 నుండి ఒంటిపూట బడులు మొదలవుతాయి. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ సహా అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మధ్యాహ్నం 12:30 గంటల వరకు పని చేస్తాయి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు జరుగుతాయి. 12 నుంచి 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం కోసం కేటాయిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవచ్చు.

ఒంటిపూట బడులను ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగిస్తారు. వేసవి సెలవులు.. ఏప్రిల్ 24 నుండి ఆరంభమౌతాయి. జూన్ 11వ తేదీ వరకు కొనసాగుతాయి. కొత్త విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీన ప్రారంభమౌతుంది. వేసవి సెలవుల్లో ఎవ్వరు కూడా పాఠశాలలను తెరవకూడదని, తరగతులను నిర్వహించకూడదని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+