వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!

వేసవి సెలవుల పైన ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. పదో తరగతి పరీక్షలు పూర్తవుతున్నాయి. అటు ఇంటర్ వాల్యుయేషన్ పూర్తి చేసారు. ఈ నెల మూడో వారంలో ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. ఇక.. వేసవి సెలవుల్లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర దించుతూ షెడ్యూల్ ను ఫిక్స్ చేసారు.

వేసవి తీవ్రత పెరుగుతోంది. పరీక్షలు చివరి దశకు చేరాయి. ఈ నెల నాలుగో వారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ లోగానే పదో తరగతి.. ఇంటర్ పరీక్షల ఫలితాల ప్రకటన దిశ గా కసరత్తు వేగవంగం చేసారు. ఇక.. వేసవి సెలవుల పైన తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది.

Telangana govt finalized summer holidays schedule for educational institutes in the state here the details

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ముందుగానే సెలవులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులకు ఏకంగా 48 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. వేసవి సెలవుల అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయి.

ఈ సారి ఫలితాల వెల్లడి ముందుగానే

అదే విధంగా 2026-27 విద్యా సంవత్సరం వార్షిక అకడమిక్ క్యాలెండర్ ను ఖరారు చేసారు. జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ సారి విద్యార్ధులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. కాగా.. సెలవుల పైన స్పష్టత రావటంతో అటు విద్యార్థులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు వేసవి ప్రయాణాలకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.

ఇక, సెలవుల కంటే ముందే సిలబస్ పూర్తి చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే, అవసరమైతే వారానికి ఒకసారి అదనపు తరగతులు నిర్వహించి విద్యా ప్రణాళికను సజావుగా పూర్తి చేయాలని ప్రభుత్వం పాఠశాల యాజమాన్యాలకు సూచించింది. తీవ్రమైన ఎండలు ప్రారంభం కాకముందే సెలవుల తేదీలను ప్రకటించడంతో పేరెంట్స్ తమ విద్యార్ధులకు భవిష్యత్ కోచింగ్.. ఇతర ప్రణాళికల పైన కసరత్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+