రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా రెండో విడత నిధుల జమ పైన స్పష్టత ఇచ్చింది. మూడు విడతల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేసింది. కాగా, రెండో విడత నిధులు ఏ కేటగిరీలో రైతుల ఖాతాల్లో జమ చేయనుందో స్పష్టం చేసింది. దీంతో, రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్న రైతులకు రిలీఫ్ దక్కనుంది.
రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరీ కీలక అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ తాజాగా రైతుల భరోసా నిధుల పైన సమీక్ష చేసారు. రైతులకు ఇచ్చిన హామీ విధంగా నిధులు జమ చేయాలని నిర్దేశించారు. అందులో భాగంగా ఆర్థిక శాఖ రూ.2,650 కోట్లను సమీకరించే పనిలో పడింది. ప్రభుత్వ ఖర్చులు, ఇతర చెల్లింపులతో పాటుగా రైతులకు భరోసా కింద అవసరమైన నిధులు అందించేందుకు అధికారులు కార్యాచరణ సిద్దం చేసారు. రెండో విడతలో ఎకరానికి మించి భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా సుమారు 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులు ఈ దఫాలో ప్రయోజనం పొందనున్నారు.

రెండో విడతలో నిధులు దక్కేది వీరికే
కాగా, ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో ఇప్పటికే 70 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్లను మార్చి 22న జమ చేశారు. దీంతో వ్యవసాయ పనులకు కొంత ఆర్థిక ఊరట లభించింది. మిగతా రైతులకు మూడో విడతలో నిధులు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈనెల చివరినాటికి మొత్తం చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే, ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.6 వేల చొప్పున సాయం అందిస్తున్న ప్రభుత్వం, మొత్తం పథకం అమలుకు దాదాపు రూ.9 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. నిధుల పరిమితి కారణంగా ఈసారి మూడు దశల్లో డబ్బులు విడుదల చేస్తోంది. ఇప్పుడు రెండో విడత నిధుల పైన స్పష్టత రావటంతో పెద్ద సంఖ్య లో రైతులకు ప్రయోజనం దక్కనుంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
భారీగా పెరిగిన యూజర్ ఛార్జీలు, ఇక ఈ సేవలు మరింత భారం..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
కేరళ గడ్డపై సీఎం సవాల్! మా గ్యారంటీలపై డౌట్ ఉంటే తెలంగాణ రండి -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..!













Click it and Unblock the Notifications