మందుబాబులకు షాక్, లిక్కర్ ధరలు భారీగా పెంపు - బ్రాండ్లు.. కొత్త రేట్లు..!!
మందు బాబులకు బిగ్ షాక్. లిక్కర్ ధరలు పెరిగాయి. మద్యం రేట్ల పెంపు పైన కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అనేక ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. ప్రస్తుతం విక్రయిస్తున్న 352 విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను ప్రభుత్వం సమీక్షించింది. టెండర్ కమిటీ సమర్పించిన నివేదిక, సిఫారసులను పరిశీలించిన అనంతరం ధరల సవరణకు ఆమోదం తెలిపింది.ఈ నెల 12వ తేదీ నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు అధికారిక సర్క్యులర్ జారీ అయింది.
తెలంగాణలో విదేశీ మద్యం ధరలు భారీగా పెరిగాయి. బ్రాండ్‌ను బట్టి ఫుల్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సగటున 6 శాతం వరకు ధరల పెంపు ఖరారు చేసారు. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం విక్రయిస్తున్న 352 విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను ప్రభుత్వం సమీక్షించింది. టెండర్ కమిటీ సమర్పించిన నివేదిక, సిఫారసులను పరిశీలించిన అనంతరం ధరల సవరణకు ఆమోదం తెలిపింది. దీంతో ఆయా బ్రాండ్లను బట్టి మద్యం కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. అన్ని బ్రాండ్లకు ఒకే విధంగా ధరలు పెంచకుండా, బ్రాండ్‌ను బట్టి ధరలను సవరించారు.

అమల్లోకి పెరిగిన ధరలు
కాగా, ఫుల్ బాటిల్‌పై కనిష్ఠంగా రూ.30 నుంచి గరిష్ఠంగా రూ.100 వరకు పెంపు ఉన్నట్లు తాజా ధరలు సూచిస్తున్నాయి. సగటున 6 శాతం వరకు ధరలు పెరగడంతో విదేశీ మద్యం కొనుగోలు దారులపై అధిక భారం పడనుంది. ప్రధానంగా స్కాచ్, సింగిల్ మాల్ట్ విస్కీలు, ప్రీమియం వోడ్కా, జిన్, వైన్ వంటి దిగుమతి బ్రాండ్ల ధరలు భారీగా పెరిగాయి. డిపోల నుంచి అక్టోబర్ 12 నుంచి సరఫరా అయ్యే ప్రతి స్టాక్‌పై సవరించిన ఎమ్మార్పీ స్టిక్కర్లను కచ్చితంగా వేయాలని, రిటైలర్లు కూడా నూతన ధరల జాబితా ఆధారంగానే విక్రయాలు జరపాలని డిపో మేనేజర్లకు, వైన్స్ మరియు బార్ యజమానులకు టీజీబీసీఎల్ ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులు కొనుగోలు చేసే ముందు బాటిల్‌పై ముద్రించిన నూతన ఎమ్మార్పీ ధరలను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications
