సినీ ప్రముఖులకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్ - నో కాంప్రమైజ్..!!
సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. సంక్రాంతికి ప్రముఖ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల భవిష్యత్ రేవంత్ నిర్ణయాల పైన ఆధార పడి ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి బెనిఫిట్ షో లు.. టికెట్ ధరల పెంపు ఉండదని అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక, ఇప్పుడు సీఎం రేవంత్ తో జరుగుతున్న సమావేశంలో ప్రభుత్వం తమ ప్రతిపాదనలు .. వైఖరి తేల్చి చెప్పినట్లు సమాచారం. సినీ పరిశ్రమ నుంచి ఏం ఆశిస్తున్నారో కూడా సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
సమావేశంలో కీలక అంశాలు
ముఖ్యమంత్రి రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ ప్రారంభమైంది. సంధ్యా థియేటర్ వివాదం .. అల్లు అర్జున్ అరెస్ట్ .. బెనిఫిట్ షో లు - టికెట్ ధరల పెంపు పైన ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ సీఎం ముందుకు వచ్చింది. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని సినీ పెద్దలు హామీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. బెనిఫిట్ షో ల గురించి పునరాలోచన చేయాలని కోరేందుకు సమాయత్తం అయ్యారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం సినీ పెద్దలకు తమ నుంచి కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వ ఆలోచనలను.. సేవా కార్యక్రమాలకు సినీ పరిశ్రమ సహకరించా లని సమావేశంలో ప్రతిపాదన చేసారు.

ప్రభుత్వ ప్రతిపాదనలు
అందులో భాగంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో ఖచ్చితంగా పొల్గొనాలని ప్రభుత్వం నుంచి ప్రతిపాదన చేసారు. ఇక, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి సినిమా టికెట్లపై విధించే సెస్సు వినియోగించాలంటున్న అంశాన్ని సినీ పెద్దలకు వివరించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన, సర్వే ప్రచార కార్యక్రమంకు తారలు సహక చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం ఉంటుందని సినీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తాజాగా చోటు చేసుకున్న ఘటనల అంశం ప్రస్తావనకు వచ్చింది.
రేవంత్ సీరియస్
అయితే, సినీ ప్రముఖులు సైతం ఒక ఘటన ఆధారంగా నిర్ణయాలు నష్టం చేస్తాయని.. తాము పూర్తి అప్రమత్తంగా వ్యవహరించి, భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లోనూ తమ భాగస్వామ్యం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ మూడ్ మేరకు ఈ సమావేశంలో బెనిఫిట్ షో .. టికెట ధరల అంశం పైన నిర్ణయం మార్చుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వంలోని ముఖ్యుల సమాచారం. సినిమా పెద్దల వినతితో రేవంత్ మనసు మారుతుందా.. బెనిఫిట్ షో లకు అనుమతి కండీషన్లతో అంగీకరిస్తారా అనేది మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications