జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్..!?
తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దం అవుతోంది. వచ్చే వారం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఇదే సమయంలో ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ వరుస పర్యటనలకు సిద్దం అవుతున్నారు. మొత్తం 123 మున్సిపాల్టీల ఓటర్ల జాబితాను ఇప్పటికే విడుదల చేసారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ పైనా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం.. ఎన్నికల సంఘం కసరత్తు తుది దశకు చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వం తాజాగా కీలక మార్పులు చేసింది. 20 మున్సిపాల్టీలు.. ఏడు కార్పోరేష న్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసారు. కాగా, జీహెచ్‌ఎంసీని సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజి గిరి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్నారు. అధికారులు ఈ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు.
త్వరలో గ్రేటర్ ఎన్నికల నిర్వహించాల్సి ఉండటంతో.. ముందుగానే మూడు కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండటం తో ఆ ఎన్నికలు పూర్తయిన వెంటనే మార్చి లేదా ఏప్రిల్ నెలలో 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతిపక్షానికే పట్టు ఉంది.

గ్రేటర్ లో 2020 లో జరిగిన ఎన్నికల్లో 55 స్థానాలను బీఆర్ఎస్, ఎంఐఎం 44 డివిజన్లలో విజయం సాధించాయి. బీజేపీ 48 డివిజన్లు, కాంగ్రెస్ 2 మాత్రమే కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక పలువురు కార్పొరేటర్లు పార్టీలో చేరడంతో కాస్త బలం పెరిగింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీలకు, మేడ్చల్‌లో 3 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. రేపు (16న) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయటం ద్వారా ముఖ్యమంత్రి పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17న జడ్చర్ల, 18న పాలేరు, అదేరోజు సాయంత్రం ములుగు జిల్లాలోని మేడారం చేరుకుని, అక్కడ రాత్రి బస చేస్తారు. ఫిబ్రవరి 3 నుంచి మళ్లీ ఉమ్మడి జిల్లాల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలు ఏర్పాటు చేయనుంది. ఎన్నికలు.. పర్యటనల బాధ్యతలను మంత్రులకు అప్పగించారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications