బిగ్ రిలీఫ్, ఆ భూముల్లో రిజిస్ట్రేషన్లకు అనుమతి - ప్రభుత్వం ప్రకటన..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించింది. జీవో 59 దరఖాస్తు దారులకు శుభవార్త చెప్పింది. కొంత కాలంగా 22 ఏ భూముల వ్యవహారం పైన వివాదం కొనసాగుతోంది. దీంతో, సీఎం రేవంత్ నిర్ణయం మేరకు రెవిన్యూ అధికారులు కీలక ఉత్తర్వులు జారీ చేసారు. కాగా.. ఇప్పుడు మరో ముందడుగు వేసారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టత ఇచ్చారు. నెల రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని వెల్లడించారు.

రెవిన్యూ మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేసారు. 22A సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో మరో కీలక ముందడుగు పడిందని తెలిపారు. 22ఎ సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు ఏడు కీలక ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. తాజాగా జీఓ 59 దరఖాస్తుదారులకు ప్రభుత్వం శుభవార్త చెబుతుందని పేర్కొన్నారు. 500 చదరపు గజాలలోపు జీఓ 59 పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ మేరకు కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇస్తూ.. మెమో నెం.48030 జారీ చేసినట్లు తెలిపారు. జీఓ 59 అమలులో అక్రమాలకు తావులేదని.. నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. గతంలో జీఓ 59 అమలులో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

దసరా వేళ తుఫాను ముప్పు, ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం- తాజా హెచ్చరిక..!!
దసరా వేళ తుఫాను ముప్పు, ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం- తాజా హెచ్చరిక..!!
telangana-govt-makes-key-progress-on-22a-land-issues-says-minister-poonguleti-srinivasa-reddy

మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

అదే విధంగా ఇప్పటికే జారీ చేసిన కన్వేయన్స్ డీడ్స్ కేసులను కూడా సమగ్రంగా పరిశీలించాలని పేర్కొన్నారు. 22-ఎపై శరవేగంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఎ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. 22-ఎకు సంబంధించిన 10-12 సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌లో ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. జీఓ118, జీఓ 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేసినట్లు చెప్పారు. 22-ఎలో ఉన్నా GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామని మంత్రి తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+