సంక్రాంతి వేళ రైతుల ఖాతాల్లో నిధుల జమ, రూ 1,429 కోట్లు విడుదల..!!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. సంక్రాంతి వేళ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. అటు ఉద్యోగులకు ఒక డీఏ విడుదల చేసిన ప్రభుత్వం.. ఇటు రైతులకు పండుగ వేళ డబ్బులు అందించింది. రైతు భరసా నిధులను సంక్రాంతికి విడుదల చేయాలని తొలుత భావించినా... ఇప్పుడు ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది. దీంతో, రైతుల ఖాతాల్లో ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులను వారి ఖాతాల్లో జమ చేసింది.
సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అమలు చేసింది. రైతులు పండించే సన్న బియ్యం వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు పథకం అమలు చేస్తోంది. గత ఏడాది కూడా సన్నబియ్యం పండించిన రైతులకు బోనస్ అందించింది. ఈ సారి కూడా కొనసాగించింది. అందులో భాగంగా తాజాగా సన్నబియ్యం పండించిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. క్వింటాకు రూ.500 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దీంతో పండుగ వేళ రైతులు సంతోషం తో ఉన్నారు. పండుగ వేళ రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయాలని నిర్ణయం తీసుకోవటంతో తాజాగా పౌరసరఫరాల శాఖ రూ.500 కోట్లు విడుదల చేసింది. వానాకాలంలో పండించిన రైతులకు ఈ నిధులు ఇచ్చింది. ఈ నిధులతో కలిసి ఇప్పటివరకు ఈ సీజన్‌లో మొత్తం రూ.1,429 కోట్ల నిధులను బోనస్ రూపంలో చెల్లించినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

కాగా, సన్న బియ్యం పండించిన వారికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం అందిస్తోంది. క్వింటాకు అదనంగా రూ.500 ఇస్తుండటంతో రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో తెలంగాణలో సన్న బియ్యం సాగు పెరుగుతోంది. రైతులు తమ బియ్యాన్ని విక్రయించుకునేందుకు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు, సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులు తమ వడ్లను అమ్ముకోనేందుకు వెసులుబాటు కల్పించారు. కాగా, నాడు ఇచ్చిన హామీ మేరకు ఈ సారి కూడా నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. రైతులు వడ్లు విక్రయించిన తర్వాత వారి వివరాలను అధికారులు నమోదు చేసుకుంటున్నారు. వారికి మద్దతు ధరతో పాటు బోనస్ డబ్బులను బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications