ఆ ఆస్తుల కొనుగోలుపై ప్రభుత్వోద్యోగులకు హెచ్చరిక!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అందించే వివిధ రకాల అడ్వాన్స్ రుణాల విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఆర్థిక శాఖ జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం, HMDA, తెలంగాణ హౌసింగ్ బోర్డు లేదా సహకార గృహ నిర్మాణ సొసైటీల ద్వారా ఇళ్లు లేదా ప్లాట్లు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు హౌసింగ్ అడ్వాన్స్ రుణాలు మంజూరు చేయకూడదు.

హౌసింగ్ అడ్వాన్స్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధన

ఈ నిబంధన ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బును మరింత జాగ్రత్తగా వినియోగించటం, బడ్జెట్ నియంత్రణల లక్ష్యంగా ఉంది. ఈ ఉత్తర్వులు 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఏప్రిల్, మే, జూన్ కోసం వివిధ కేటగిరీల అడ్వాన్స్ రుణాల నిధులను విడుదల చేస్తూ జారీ చేయబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల నుంచి ఇళ్లు కొనుగోలు చేస్తే మాత్రమే హౌసింగ్ అడ్వాన్స్ పొందవచ్చు.

telangana govt shock to govt employees no housing advances for HDMA housing board properties

గృహ అడ్వాన్స్ రుణాల రూల్స్ ఇవే

ప్రభుత్వ సంస్థల ఆస్తులపై ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. గృహ అడ్వాన్స్ రుణాల కోసం ఈ త్రైమాసికానికి రూ.50 కోట్లు విడుదల చేయబడ్డాయి. నిధుల పంపిణీలో రూల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. జిల్లా మరియు ప్రాంతీయ కార్యాలయాల ఉద్యోగుల కోసం కేటాయించిన నిధులను సచివాలయం లేదా హెడ్ ఆఫీసు సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లించరాదు. ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులకు అడ్వాన్స్ మంజూరు చేసేటప్పుడు వారి ఆర్థిక సామర్థ్యాన్ని పరిశీలించాలి.

అడ్వాన్స్ ఇచ్చే విషయంలో అడుగడుగునా పరిశీలన

ఇంటి నిర్మాణం లేదా మరమ్మత్తులకు అవసరమైన మొత్తంలో అడ్వాన్స్ తప్ప మిగిలిన భాగాన్ని ఉద్యోగి స్వయంగా ఏర్పాటు చేసుకోగల సామర్థ్యం ఉందా లేదా అని చెక్ చేసి మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించారు. రుణాల రికవరీ విషయంలో కూడా కఠిన నిబంధనలు విధించారు. మంజూరైన మొత్తాన్ని నిర్ణీత గడువులోగా ఉద్యోగి వేతనం నుంచి తిరిగి వసూలు చేయడం హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ బాధ్యతగా పేర్కొన్నారు.

ఉద్యోగులపై ఆర్థిక భారం తగ్గించేలా కూడా నిర్ణయాలు

ఇంటి రుణాలతో పాటు ఇతర అవసరాలకు కూడా నిధులు కేటాయించారు. కొత్త కార్ల కొనుగోలుకు రూ.12.50 కోట్లు, ద్విచక్ర వాహనాలకు రూ.2.50 కోట్లు, కంప్యూటర్ల కొనుగోలుకు రూ.50 లక్షలు విడుదల చేశారు. పిల్లల ఉన్నత విద్య మరియు అత్యవసర ఖర్చుల కోసం రూ.2 కోట్లు కేటాయించారు. విద్యా రుణాల రికవరీని గతంలో 8 నెలల నుంచి 10 నెలలకు పెంచడం ద్వారా ఉద్యోగులపై ఆర్థిక భారం తగ్గించే చర్య తీసుకున్నారు.

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత..ఆయిల్ కంపెనీలు ఏమన్నాయంటే
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత..ఆయిల్ కంపెనీలు ఏమన్నాయంటే

ప్రభుత్వ ఆస్తులకు బదులుగా ప్రైవేట్ ఆప్షన్లను పరిశీలించాలి

ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించడం, అనవసరమైన ఖర్చులను నియంత్రించడం, అర్హులైన ఉద్యోగులకు మాత్రమే సౌకర్యాలు అందించడం లక్ష్యంగా పని చేస్తాయి. ఉద్యోగులు ఈ కొత్త నిబంధనలను గమనించి, ప్రభుత్వ ఆస్తులకు బదులుగా ప్రైవేట్ ఆప్షన్లను పరిశీలించాలని సూచిస్తున్నారు. ఈ చర్యలు దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+