H-CITI: హైదరాబాద్ కోర్ సిటీపై బిగ్ ప్లాన్

Revanth Reddy: హైదరాబాద్ కోర్ సిటీకి మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి సారించింది. కోర్ అర్బన్ సిటీతో పాటు, సెమీ అర్బన్, రూరల్, అవుటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాలను పూర్తిస్థాయి అభివృద్ధిపై ప్రత్యేకంగా ఓ ప్రణాళికను రూపొందించనుంది.

పెరుగుతున్న హైదరాబాద్ నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్రమైన పాలసీని తయారు చేయాలని ఆదేశించారు.

Telangana govt to prepare comprehensive plans for Core Urban Region development inside ORR

నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల పురోగతిపై వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు.

కోర్ అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సూచించారు.

H-CITI అభివృద్ధి పనులకు సంబంధించి వివరాలను అధికారులు తెలియజేయగా, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు.

తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలను తయారు చేయాలని చెప్పారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల్లో ప్రస్తుత పరిస్థితిని అధికారులు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వివరించారు.

అసంపూర్తిగా ఉన్న పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రేవంత్ ఆదేశించారు. ముఖ్యంగా నగరంలో పారిశుధ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని, వర్షాకాలంలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+