ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ హిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించే దిశగా కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ కోర్​ అర్భన్​ రీజియన్​ పరిధిలో 1.26 లక్షల ఆటో రిక్షాలను దశలవారీగా ఈవీలుగా మార్చడంపై ఫోకస్ చేసారు. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో నడుస్తున్న ఆటోలకు ఎలక్ట్రిక్​ కిట్లను అమర్చేందుకు ప్రత్యేక పాలసీ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించారు.

హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని ఆటోల విషయంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు సిద్దం చేసింది. పెట్రోలు, డీజిల్​ తో పనిచేసే ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్‌ కిట్లతో రెట్రోఫిట్‌ చేసేందుకు ఆటో యజమానులకు 100 శాతం ఆర్థిక సహాయాన్ని అందించేవిధంగా చర్యలు చేపట్టాలని సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 2026-27 బడ్జెట్‌లో ఇందుకోసం రూ.200 కోట్లు కేటాయించాలని ఆదేశించారు. అయితే పెట్రోల్, డీజిల్ ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లను అమర్చేందుకు ఆటో యజమానులకు 100 శాతం ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచనలు చేశారు. ఆటోడ్రైవర్లపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు సంక్షేమ శాఖల సబ్‌ ప్లాన్‌ల నుంచి నిధులను సబ్సిడీ ద్వారా అందించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఆటోలకు ఈ-కిట్లు అమర్చేందుకు సుమారు లక్షా ఇరవై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

telangana-govt-will-gradually-replace-diesel-autos-with-electric-kits-in-the-city-as-part-of-the-po

ప్రభుత్వం భారీ ప్రణాళికలు

ఆటోలకు ఎలక్ట్రిక్‌ కిట్లు పెట్టేందుకు దాదాపు రూ.1.20 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా ఖర్చవుతుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా ORR పరిధిలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులే నడిపిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మార్పుతో ఆటోల కారణంగా వెలువడే శబ్ద, వాయు కాలుష్యాలు తగ్గుతాయి. ఇదే కాకుండా ఆటో డ్రైవర్లకూ నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆటోలకు ఏర్పాటు చేసే ఈ విధానం ద్వారా సుమారు రూ.1.20 లక్షలు అవుతుంది. ఫిక్స్‌డ్‌ బ్యాటరీ సిస్టమ్​ అయితే సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మరో 150 ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్న క్రమంలో కర్బన ఉద్గారాల స్థాయి భారీగా తగ్గనున్నట్లుగా తెలుస్తోంది. రెండు సంవత్సరాల్లో మరో 2,500 రోడ్డెక్కించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటంతో త్వరలో పూర్తి స్థాయిలో ఈవీ బస్సులు నగరంలో ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+