తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు, భారీగా పెరిగిన ఎస్టీ రిజర్డ్వ్ స్థానాలు

హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. 12,751 పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎస్టీ రిజర్వ్డ్ పంచాయతీలు భారీగా పెరిగాయి. షెడ్యూల్ ట్రైబల్స్ ఏరియాలో ఎస్టీలకు 1281 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న 1,177 గ్రామాలు ఎస్టీలకు కేటాయించారు.

మిగతా గ్రామాల్లోని పంచాయతీల్లో 688 ఎస్టీలకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలకు 2,113 పంచాయతీలు ఉన్నాయి. బీసీలకు 2,345, జనరల్‌కు 5,147 పంచాయతీలు కేటాయించారు. జిల్లాల వారీగా కూడా పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు చేశారు.

Telangana Gram Panchayat elections reservations finalised on Monday.

కాగా, పంచాయతీ రిజర్వేషన్లను తేల్చేందుకు అధికారులు కుస్తీలు పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల రిజర్వేషన్లు పాతికేళ్లకు ఓసారి ఖరారైతే పంచాయతీల్లో అయిదేళ్లకోసారి మారుతుంటాయి. దానికి తోడు తెలంగాణ కొత్త రాష్ట్రం కావడంతో కొత్తగా పంచాయతీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. అనంతరం ప్రతీ అయిదేళ్లకు రొటేషన్‌ చేస్తారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు మహిళలు, బీసీ రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+