TG Group-2 Results: గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే?
TG Group-2 Results: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. గతేడాది డిసెంబర్ లో టీజీపీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను అభ్యర్థుల మార్కులతో పాటు ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ ను టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. గ్రూప్-2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లను కూడా టీజీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
తెలంగాణలో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటీఫికేషన్ విడుదల చేయగా.. ఈ పరీక్షకు 5,51, 943 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 15, 16 తేదీలలో మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు సగం మంది మాత్రమే హాజరయ్యారు. తాజాగా నేడు టీజీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్, ఓఎంఆర్ షీట్లు, ఫైనల్ కీలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాల కోసం.... క్లిక్ చేయండి













Click it and Unblock the Notifications