గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ రాష్ట్రంలో 2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ న్యాయపోరాటం వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. 2019లో TGPSC విడుదల చేసిన తుది సెలక్షన్ లిస్ట్‌ను హైకోర్టు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ కీలక నిర్ణయానికి ప్రధాన కారణం .. పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలు. 2015 గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన OMR షీట్లు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని పేర్కొంటూ గతంలో కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

8 వారాల్లో కొత్త లిస్ట్ ఇవ్వాలని ఆదేశం
దీంతో హైకోర్టు TGPSCకి కఠిన ఆదేశాలు జారీ చేసింది.తక్షణమే రద్దయిన 2019 సెలక్షన్ లిస్ట్‌ను ఉపసంహరించుకోవాలి.వివాదాస్పదమైన OMR షీట్లను నిష్పాక్షికంగా రివాల్యుయేషన్ తిరిగి మూల్యాంకనం చేయాలి.ఈ ప్రక్రియ మొత్తాన్ని 8 వారాల్లో పూర్తి చేసి, కొత్తగా సవరించిన సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేయాలి.
ఈ తీర్పుతో ఒకవైపు ఇప్పటికే ఉద్యోగాలు పొందిన కొందరికి షాక్ తగిలినా, మరోవైపు న్యాయం జరగాలని పోరాడిన ఎంతో మంది అభ్యర్థులకు ఊరట లభించింది. పారదర్శకత, నిష్పాక్షికతతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగాలనే సందేశాన్ని ఈ తీర్పు బలంగా ఇచ్చింది.












Click it and Unblock the Notifications