TG Group-3 Results: గ్రూప్-3 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

TG Group-3 Results: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జాబితాతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్, ఫైనల్ కీని కూడా విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 1365 గ్రూప్-3 పోస్టులకు గతేడాది నవంబర్ 17, 18 తేదీలలో రాత పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేవలం 2.69 లక్షల మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. అంటే రాత పరీక్షలకు 50.24 శాతం హాజరైనట్లు తెలుస్తోంది.

Telangana Group-3 Results Released Check Your Results Here

అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు. టీజీపీఎస్సీ ఇటీవల కాంపిటీటివ్ పరీక్షల ఫలితాలను వరుసగా విడుదల చేస్తోంది. చెప్పినట్లుగానే షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 10, 11 తేదీల్లో గ్రూప్-1 ఫలితాలు, గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

గ్రూప్-2 ఫలితాల కోసం.. క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+