Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు, ఏడుగురు మృతి

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం కూడా వెయ్యి కేసులకుపైగా నమోదయ్యాయి. తాజాగా తెలంగాణలో 1284 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,780కు చేరింది. శనివారంనాడు 1902 మంది కోలుకున్నారు.

మొత్తం రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 30,607కు చేరింది. రికవరీ రేటు 70శాతానికి చేరింది. శనివారం రోజు ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 409కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,765 యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది.

 Telangana Has 1284 New Positive COVID 19 Cases And Total Cases Are 43780

తాజా కేసుల్లో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 667 కేసులున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్ 62, సంగారెడ్డి 86, ఖమ్మం 10, కామారెడ్డి 2, వరంగల్ అర్బన్ 37, వరంగల్ రూరల్ 5, నిర్మల్ 1, కరీంనగర్ 58, జగిత్యాల 1, యాదాద్రి భువనగిరి 10, పెద్దపల్లి 14, మెదక్ 15, మహబూబ్ నగర్ 16, మంచిర్యాల 19, జయశంకర్ భూపాలపల్లి 4, నల్గొండ 46, రాజన్న సిరిసిల్ల 2, ఆదిలాబాద్ 8, ఆసిఫాబాద్ 2, వికారాబాద్ 35, నాగర్ కర్నూలు 1, జనగాం 6, నిజామాబాద్ 26, వనపర్తి 24, సిద్దిపేట్ 22, సూర్యపేట 23, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, శనివారం వరకు రాష్ట్రంలో 2,52,700 కరోనా పరీక్షలు చేశారు.

Recommended Video

    Vitamin C Rich Foods To Beat Corona విటమిన్ సి అధికంగా ఉండే ఈ ఫుడ్ తీసుకుంటే కరోనా మీ దరి చేరదు...!!

    దేశంలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 10,46,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,63,434 యాక్టివ్ కేసులున్నాయి. ఇక 6,56,444 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 26,351 మంది కరోనాతో మరణించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+