HCU: తెలంగాణ హైకోర్టులో వాయిదా
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చెట్ల నరికివేత వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీనికి వ్యతిరేకంగా దాఖలైన వివిధ పిటీషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో కూడా విచారణలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటివరకు చెట్ల నరికివేతకు బ్రేక్ పడింది.
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుక యారా డివిజన్ బెంచ్ సమక్షానికి ఈ పిటీషన్లు విచారణకు వచ్చాయి. ఈ ప్రాంతంలో 400 ఎకరాల అటవీ భూమిలో చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ వాట ఫౌండేషన్, రిటైర్డ్ సైంటిస్ట్ కలపల బాబురావు దాఖలు చేసిన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం, విద్యార్థి సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లు అవి.

వాట ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి తన వాదనలను వినిపించారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో కూడా విచారణలో ఉందని గుర్తు చేశారు. దీనిపై మరింత విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిందని అన్నారు. సుప్రీంకోర్టు ఇప్పుడు నేరుగా ఈ విషయాన్ని విచారిస్తోన్నందున- మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయని గుర్తు చేశారు.
దీనికి న్యాయమూర్తులు బదులిస్తూ- పిటీషన్‌దారులందరూ అంగీకరిస్తే విచారణను వాయిదా వేస్తామని అన్నారు. సెలవుల తరువాత విచారణ చేపడతామని అన్నారు. అటవీ మంత్రిత్వ శాఖ తరపున సీనియర్ అడ్వొకేట్ మేనకా గురుస్వామి తన వాదనలు వినిపించారు. ఈ కేసుపై తప్పుడు వార్తలు వస్తోన్నాయని ఆందోళన వ్యక్తం చేయగా..లిఖితపూరకంగా కౌంటర్ దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది.
కాగా కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేత అంశంపై సుప్రీంకోర్టు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కీలక ఆదేశాలను జారీ చేసింది. 400 ఎకరాల అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత అంశం సుప్రీంకోర్టు సమక్షానికి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. మధ్యంతర నివేదికను అందజేయాలంటూ సూచించింది.
తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని సందర్శించాలని నివేదికను అందజేయాలని పేర్కొంది. అలాగే తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో చెట్ల నరికివేతకు అనుమతి లేదంటూ తెలంగాణ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications