వేసవిని తలపిస్తున్న అక్టోబర్ ఎండలు - అప్పటి వరకు ఇంతే, తాజా అలర్ట్స్..!!
వాతావరణంలో భిన్న మార్పులు కనిపిస్తున్నాయి. రెండో వేసవి తరహా పరిస్థితులు నెలకొన్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత ప్రజలను కష్టాల్లో నెట్టేస్తోంది. గాలిలో తేమ శాతం తగ్గడంతో వేడి తీవ్రత మరింత పెరిగింది. ఈ పరిస్థితి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితులు ఎప్పటి వరకు కొనసాగుతాయనేది వాతావరణ శాఖ నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగి నిప్పుల కొలిమిలా మారాయి. ప్రధానంగా ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి, ఇది ప్రజలను కలవరపెడుతోంది. శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం 60 నుంచి 70 శాతం మధ్య ఉండాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో 50 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. మైదాన ప్రాంతాల్లో గాలి కాలుష్యం వల్ల వేడి పెరిగినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం గాలిలో తేమ శాతం 49 శాతానికి పడిపోయింది, ఇది వేడి తీవ్రతను సూచిస్తుందని చెబుతున్నారు.

వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
అదే విధంగా రామగుండంలో 42, హనుమకొండలో 49, మహబూబ్‌నగర్‌లో 51, నిజామాబాద్‌లో 45, నల్గొండలో 45 శాతం తేమ నమోదైంది. రానున్న మూడు రోజుల్లో పెద్దపల్లి, ఖమ్మం, మంచిర్యాల, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జగిత్యాల, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేయడం జరిగింది. మరోవైపు, నైరుతి రుతుపవనాలు ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణపై నుంచి పూర్తిగా నిష్క్రమించనున్నాయి. రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.













Click it and Unblock the Notifications
