Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంటర్ పరీక్షలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్: 25 నుంచి పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ పరీక్షలను ఆపలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. చివరి నిమిషంలో ఇంటర్‌ పరీక్షల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. అక్టోబర్ 25 నుంచి జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్ కోర్టును కోరారు. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ఉండగా పిటిషన్ వేస్తే ఎలా అని ప్రశ్నించింద.ి చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో తమ పిటిషన్‌ను తల్లిదండ్రుల సంఘం వెనక్కి తీసుకుంది.

 Telangana high court gives green signal to intermediate exams, from 25th october

కాగా, ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అక్టోబర్ 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. గత సంవత్సరం కరోనాతో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో అందరినీ పరీక్ష లేకుండానే ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు.

ఒకసారి ప్రమోట్ అయిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం సరికాదని, ఇప్పటికే వారంతా ద్వితీయ సంవత్సరం చదువుతున్నందున మళ్లీ మొదటి సంవత్సరం సబ్జెక్టులు చదవడంతో గందరగోళానికి, ఒత్తిడికి గురవుతారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. మిగితా వారిలాగే వారందరినీ పాస్ అయినట్లు ప్రకటించాలని కోరుతూ గురువారం పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థించడంతో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హైకోర్టు విచారణ చేపట్టింది.

ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేగాక, విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేసిన సందర్భంలోనే పరిస్థితిని బట్టి మళ్లీ పరీక్ష ఉంటుందని చెప్పామని తెలిపారు. గతంలో ఈ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదని, ఇప్పుడు ఈ పరీక్షలు కూడా రాయకపోతే భవిష్యత్తులో ఏదైనా పరిస్థితులు ఎదురై ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా రాయకుంటే వారిని ఎలా ఎవాల్యుయేట్ చేయాలన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Recommended Video

    YS Sharmila Padayatra: కాంగ్రెస్ పార్టీ పై ఘాటు వ్యాఖ్యలు, మండిపడ్డ TPCC Secretary

    ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ కేసులో వాదోపవాదలను పక్కనపెట్టి.. అసలు చివరి నిమిషంలో పిటిషన్ వేస్తే ఎలా విచారణ జరుపుతామంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. దీంతో తల్లిదండ్రుల సంఘం తమ పిటిషన్ ఉపసంహరించుకుంది. పరీక్షలకు సహకరిస్తామని పేర్కొంది. దీంతో అక్టోబర్ 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు యధావిధిగా జరగనున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+