హుస్సేన్ సాగర్, చెరువుల్లో పీవోపీ గణేష్ విగ్రహాల నిమజ్జనం వద్దు: హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్, చెరువుల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కృత్రిమ కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పేర్కొంది.
ఈ మేరకు తగిన చర్యలు తీసుకుని అమలు చేయాలని సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అమలు చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. దీంతో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.

ఖైరతాబాద్ మహా గణపతి లడ్డూ ప్రసాదం పంపిణీ
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ మహా గణపతి అడ్డూ ప్రసాదం సోమవారం ఉదయం నుంచి భక్తులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. కిలోమీటర్ల మేర క్యూలలో వినాయకుడి దర్శనం, ప్రసాదాల కోసం భక్తులు బారులు తీరారు. లడ్డూ ప్రసాదం స్వీకరించిన భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ అక్కడ్నుంచి బయల్దేరుతున్నారు.
ఖైరతాబాద్ గణపతికి పోటెత్తిన భక్తులు
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి సెలవు రోజు కావడంతో ఆదివారం భక్తులు పోటెత్తారు. కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. భక్తులు వాహనాలను రోడ్లపై ఎక్కడపడితే అక్కడే పార్క్ చేసి వెళ్లడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు భక్తులను అదుపులో చేసేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరోవైపు, సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఇబ్బందులు పడాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనంకు వినాయక విగ్రహాలు వస్తుండటంతో ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీగా ఉంటోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications