బర్రెలక్కకు భద్రత కల్పించండి: హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క సంచలనంగా మారారు. ఇటీవల ప్రచారం చేస్తుండగా తన సోదరుడిపై కొందరు దాడి చేసి గాయపర్చారంటూ బర్రెలక్క కన్నీటిపర్యంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తమకు భద్రత కల్పించడం లేదంటూ బర్రెలక్క హైకోర్టులో పిటిషన్ వేశారు.
అంతేగాక, ఎన్నికల ప్రచారం చేయొద్దని, పోటీ నుంచి తప్పుకోవాలంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు హైకోర్టుకు తెలిపారు. ఆమె పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేసిన హైకోర్టు.. ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్క అలియాస్ శిరీష కుటుంబం మొత్తానికి భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడా సమాచారం ఇచ్చింది.

శిరీష ప్రచారం చేసే సమయంలోనూ రక్షణ కల్పించాలని.. ఎన్నికలు పూర్తయ్యే వరకు అభ్యర్థి భద్రత పోలీస్ శాఖ బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన పార్టీల నేతలకే కాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర బెదిరింపులు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు కూడా భద్రత కల్పించాలని తెలిపింది.
ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్క : నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష అలియాస్ బర్రెలక్క నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి మద్యానికి బానిసయ్యాడు. చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లితో కలిసి ఎన్నో కష్టాలు పడుతూ చదువుకుంది. ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ చేసి.. గ్రూప్-1, గ్రూప్-2 ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. ఎన్నోసార్లు ప్రయత్నించిన శిరీష.. ఇక తనకు ఉద్యోగం రాదంటూ.. అందుకే నాలుగు బర్రెలు కొనుక్కుని కాస్తున్నాంటూ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల గురించి చెబుతూ ఓ రీల్ చేసింది.
అయితే, 30 సెకన్లు ఉన్న ఆ రీల్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ కావడంతో శిరీష కాస్త బర్రెలక్కగా ఫేమస్ అయింది. ఆ ఫేంతోనే ఈసారి ఎన్నికల బరిలో నిలవాలనుకుంది. అనుకున్నదే తడవుగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది. నామినేషన్ వేసిన తర్వాత పలువురి నుంచి బెదిరింపులు ఎదురైనా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నిరుద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న దృఢ నిశ్చయంతో ప్రచారాన్ని మొదలుపెట్టింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పంచడమే మేనిఫెస్టోగా ముందుకెళ్తోంది. ఆకట్టుకునేలా మేనిఫెస్టోను విడుదల చేసి ప్రచారం దూసుకెళ్తున్నారు బర్రెలక్క.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications