తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణఫై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో జూన్ 11 న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

జస్టిస్ పుల్లా కార్తీక్ ఈ పిటిషన్ గురువారం విచారణ జరిపారు. వివిధ పరీక్షల మధ్య వ్యవధి నిబంధన పాటించట్లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు వేయాలని హోంశాఖ కార్యదర్శి, సిట్‌ను ఆదేశించింది. ఈ మేరకు స్టేకు నిరాకరించింది. ఇక విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Telangana high court

కాగా, అంతకుముందు ఇదే పిటిషన్‌పై వెకేషన్‌ కోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిపిన జస్టిస్‌ కె.లక్ష్మణ్.. తన కుమార్తె కూడా గ్రూప్‌-1 పరీక్ష రాస్తున్నందున పిటిషన్‌​ను విచారించలేనని తెలిపారు. మధ్యాహ్నం మరో బెంచ్‌​కు పంపిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం విచారణ జరిపిన జస్టిస్ పుల్లా కార్తీక్‌.. పరీక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు.

గత సంవత్సరం అక్టోబర్‌ నెలలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. ప్రిలిమ్స్‌ రాసిన అభ్యర్థులంతా మెయిన్స్‌ పరీక్షల కోసం సన్నద్ధమవుతుండగా.. మార్చి నెలలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా పలు పరీక్షలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది.

ఇటీవల గ్రూప్‌-1 పరీక్షను జూన్ 11న నిర్వహించేందుకు నిర్ణయించింది టీఎస్‍పీఎస్సీ. ఈ క్రమంలోనే గ్రూప్‌-1 పరీక్షలను కనీసం మరో 2 నెలలు వాయిదా వేయాలని కోరుతూ సుమారు 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా టీఎస్​పీఎస్సీ చట్టం ప్రకారం గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షల మధ్య తగినంత విరామం ఉండేలా నిర్వహించాల్సి ఉందని.. ఈ మేరకు మే 11న టీఎస్‌పీఎస్సీకి ఇచ్చిన వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఆ నిబంధనకు విరుద్ధంగా టీఎస్​పీఎస్సీ వ్యవహరిస్తోందని పిటిషనర్లు వాదించారు. విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణపై స్టేకు నిరాకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+