తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిపమెంటరీ పరీక్షలు: టైమ్ టేబుల్ ఇదే, హాల్ టికెట్స్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 అంటే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లకు తెలియజేసి సరిచేయించుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు. అయితే, ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్ధులు 2,70,583 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు 1,41,742 మంది హాజరుకానున్నారు. రెండింటికీ కలిపి 4,12,325 మంది హాజరవుతారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఇప్పటికే తెలిపారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు:
జూన్ 12- ల్యాంగ్వేజ్ పేపర్ 1
జూన్ 13- ఇంగ్లిష్
జూన్ 14- మ్యాథ్స్ 1A, బోటనీ, పొలిటికల్ సైన్స్
జూన్ 15- మ్యాథ్స్ 1B, జువాలజీ, హిస్టరీ
మ్యాథ్స్ 16- ఫిజిక్స్, ఎకనామిక్స్
మ్యాథ్స్ 17- కెమిస్ట్రీ, కామర్స్
మ్యాథ్స్ 19- పబ్లిక్ అడ్మినస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ (బైపీసీ)
మ్యాథ్స్ 20- మోడ్రన్ ల్యాంగ్వేజ్, జాగ్రఫీ
సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు:
జూన్ 12- ల్యాంగ్వేజ్ పేపర్ 2
జూన్ 13- ఇంగ్లిష్-2
జూన్ 14- మ్యాథ్స్ 2A, బోటనీ, పొలిటికల్ సైన్స్
జూన్ 15- మ్యాథ్స్ 2B, జువాలజీ, హిస్టరీ
మ్యాథ్స్ 16- ఫిజిక్స్, ఎకనామిక్స్
మ్యాథ్స్ 17- కెమిస్ట్రీ, కామర్స్
మ్యాథ్స్ 19- పబ్లిక్ అడ్మినస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ (బైపీసీ)
మ్యాథ్స్ 20- మోడ్రన్ ల్యాంగ్వేజ్, జాగ్రఫీ
జూన్ 21, 22 తేదీల్లో ఎథిక్స్, ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పేపర్లు ఉంటాయి.
హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications