ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల - సిలబస్ లో కీలక మార్పులు..!!
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. మరో వైపు ఇంటర్ సిలబస్ లో సమూల మార్పులు చేర్పులు చేసింది. ఫస్టియర్‌లోనే ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. NCERT ప్రకారం సబ్జెక్టు కమిటీ సూచనల ప్రకారం మార్పులు అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టత ఇచ్చారు.
ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 25న పరీక్షలు ప్రారంభమై మార్చి 18న ముగియనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కీలక అంశాలను వెల్లడించింది. ఫిబ్రవరి 25 నుంచి ఫస్ట్ ఇయర్, 26 నుంచి రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు జనవరి ఆఖరు లో ప్రారంభించి ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి చేయనున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్‌లో పలు మార్పుచేర్పులను చేసింది.

ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ మారనుంది. ఇంటర్‌లో బోటనీ, జువాలజీ సిలబస్‌లో మార్పుచేర్పులు చేయనుంది. మరోవైపు హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్ సిలబస్‌ను ప్రవేశపెడుతుంది. అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్‌లతో ఏసీఈ కోర్సును తీసుకొస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలోనూ ల్యాబ్స్, ప్రాక్టికల్ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇంటర్నల్స్‌కు 20 మార్కులు, ఎక్స్‌టర్నల్ పరీక్షలు 80 మార్కులకు ఉంటుంది. ఇక.. సాధారణంగా ప్రాక్టికల్ పరీక్షలను రెండో సంవత్సరంలో నిర్వహించే పద్ధతి ఉండేది. అయితే ప్రస్తుత మార్పుల ప్రకారం, విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే ప్రయోగశాలలపై దృష్టి సారించడానికి, పూర్తి స్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ నిర్ణయం సహాయపడు తుందని అధికారులు చెబుతున్నారు.
ఫస్టియర్‌లోనూ ల్యాబ్ ఎగ్జామ్స్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. 40 నుంచి 45 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లో కూడా ఉంటాయని చెప్పారు. ఇక.. 2026 నుండి ACE కొత్త గ్రూప్ ప్రారంభం అవుతుందని అధికారులు వివరించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications