Inter Exams: ప్రాక్టికల్స్ మార్కుల లెక్క ఇదే! సిలబస్‌తో పాటు మారిన మార్కుల విధానం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులకు బోర్డు కీలక మార్పులు తీసుకొచ్చింది. చదువుకునే సిలబస్‌తో పాటు పరీక్షల విధానంలోనూ సమూల మార్పులు చేశారు. ఇప్పటివరకు కేవలం కొన్ని సబ్జెక్టులకే పరిమితమైన ప్రాక్టికల్స్‌ను.. ఇప్పుడు అన్ని సబ్జెక్టులకు (ఇంటర్నల్ అసెస్‌మెంట్ రూపంలో) ప్రవేశపెట్టారు. ఈ కొత్త విధానంపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

కొత్త విధానం ప్రకారం మొత్తం మార్కుల్లో రాత పరీక్షకు 80 శాతం, ప్రాక్టికల్స్‌కు 20 శాతం మార్కులను కేటాయించారు. ఒకవేళ ఎగ్జామ్ 80 మార్కులకు ఉంటే, విద్యార్థులు పాస్ కావాలంటే కనీసం 28 మార్కులు (35 శాతం) సాధించాల్సి ఉంటుంది. అలాగే ప్రాక్టికల్స్‌‌కు కేటాయించిన 20 మార్కులలో కనీసం 7 మార్కులు వస్తేనే పాసైనట్లు లెక్క. సైన్స్ సబ్జెక్టుల విషయానికి వస్తే.. గతంలో కేవలం సెకండియర్‌‌లోనే ప్రాక్టికల్స్ ఉండేవి. కానీ, ఇకపై ఫస్టియర్‌లో సగం, సెకండియర్‌లో మరో సగం చొప్పున ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.

Telangana Inter Exams 2026-27 Board Introduces New Syllabus And Practical Exams For 1st Year Students
Inter Practical మార్కుల్లో కొత్త మార్పులు.. వారానికి 2 రోజులు ల్యాబ్ తప్పనిసరి!
Inter Practical మార్కుల్లో కొత్త మార్పులు.. వారానికి 2 రోజులు ల్యాబ్ తప్పనిసరి!

ఇంగ్లీష్ సబ్జెక్టులోనూ ప్రత్యేక మార్పులు

ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయంలోనూ బోర్డు స్పష్టతనిచ్చింది. ఫస్టియర్ విద్యార్థులకు ఒకే ఒక పాఠ్య పుస్తకం ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్లో టెక్స్ట్ బుక్‌తో పాటు ప్రత్యేకంగా 'ఇంగ్లిష్ ప్రాక్టికల్ మాన్యువల్' కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త మార్పులు, సిలబస్ వివరాలు, సబ్జెక్టుల వారీగా మార్కుల కేటాయింపు వంటి సమస్త సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ https://tgbienew.cgg.gov.in లో పొందుపరిచామని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ తెలిపారు.

ఇంటర్ చదివే ఈ విద్యార్ధులకు స్కూటీలు - ప్రభుత్వం మార్గదర్శకాలు..!!
ఇంటర్ చదివే ఈ విద్యార్ధులకు స్కూటీలు - ప్రభుత్వం మార్గదర్శకాలు..!!

కాలేజీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

ఈ కొత్త పరీక్షా విధానంపై విద్యార్థులకు ఎటువంటి గందరగోళం లేకుండా చూడాల్సిన బాధ్యత కళాశాలల యాజమాన్యాలపై ఉంది. ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు ఉంటాయి, పాస్ మార్కులు ఎలా లెక్కగడతారు అనే పూర్తి వివరాలను ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా వివరించాలని బోర్డు ఆదేశించింది. కాబట్టి విద్యార్థులందరూ ఈ కొత్త విధానాన్ని గమనించి అందుకు తగ్గట్టుగా చదువులో విజయం సాధించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+