TS Inter Results 2023: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉద‌యం 11.00 గంట‌ల‌కు నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇద్రారెడ్డి ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్నారు. ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేయబోతున్నారు.

మార్చి 15 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు.

Inter

ఫలితాల వెల్లడికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులు మంగళవారం ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్లు tsbie.cgg.gov.in ద్వారా వేగంగా ఫలితాలు చూసుకోవచ్చు. మొదటగా ఇంటర్‌బోర్డు పరీక్ష పత్రాల ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినా, వీలు కాకపోవడంతో ఆఫ్‌లైన్‌ ద్వారా మూల్యాంకనం చేపట్టారు.

పలు దఫాలుగా ట్రయల్‌రన్‌ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారౖణెందని, దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే విడుదల చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+