TG ఇంటర్ ఫలితాల డేట్, టైం - వాట్సాప్ లోనే రిజల్ట్స్.. ఇలా చెక్ చేయండి..!!
తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్. ఇంటర్ ఫలితాల విడుదల ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారింగా ప్రకటన చేసింది. ఇదే సమయంలో ఈ సారి ఫలితాలను సులభంగా తెలుసుకునేందుకు విద్యార్ధులకు కొత్త విధానం అందబాటులోకి తీసుకొచ్చారు. వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయటం ద్వారా వెంటనే ఫలితాలు తెలిసే విధంగా అవకాశం కల్పించారు. సీఎం రేవంత్ ఈ సారి ఫలితాలను విడుదల చేయనున్నారు.
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఆత్రతుగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న మధ్యహ్నం12:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇంటర్ ఫస్ట్ అండ్ సెకంర్ ఇయర్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. కాగా, ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 9.9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు అయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు 5,07,949 మంది ఉన్నారు. అయితే గతంలో జరిగిన తప్పులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఫలితాల విడుదల విషయంలో ఇంటర్ బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకుంది.

వాట్సప్ నెంబర్ ద్వారా ఫలితాల వెల్లడి
పరీక్ష మార్కుల లెక్కింపులో ఎలాంటి తేడాలు జరగకుండా ఒకటి రెండు సార్లు మూల్యాంకనం చేసింది. అయితే కేవలం ఒకటి రెండు మార్కుల దగ్గర, ఒక్క పేపర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రీ-వాల్యూయేషన్ చేసారు. ఈ సారి ఫలితాలను వాట్సప్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేసారు. గతంలో ఇదే విధానంలో హాల్ టికెట్లు విజయవంతంగా పంపిణీ చేయగా, ఇప్పుడు ఫలితాలను కూడా ఇదే రకంగా వాట్సప్ ద్వారా అందిస్తున్నారు. విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసి 'Hi' అని మెసేజ్ పంపాలి. అనంతరం మెనూలో "BIE Exam Result" ఎంపికను ఎంచుకుని, హాల్ టికెట్ నంబర్, సంవత్సరం (1వ సంవత్సరం/2వ సంవత్సరం), స్ట్రీమ్ (General/Vocational) వివరాలను నమోదు చేయాలి. వివరాలు సమర్పించిన వెంటనే ఫలితాలు మెసేజ్ రూపంలో ప్రత్యక్షమవుతాయి.












Click it and Unblock the Notifications