వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాధ్యం కాదు: విదేశీ వనితలతో కెటిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. కేంద్ర విదేశీ వ్యవహరాలు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత-పేదరిక నిర్మూలన' అనే అంశంపై తాజ్‌కృష్ణ హోటల్‌లో మూడురోజులపాటు జరుగనున్న అంతర్జాతీయ సదస్సును మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని, అందుకే తమ ప్రభుత్వం మహిళాభివృద్ధితోపాటు వారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. గ్రామీణ మహిళల సాధికారత, సమస్యలు, వాటి పరిష్కారాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు. దళిత మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవల చేసిన భూపంపిణీ పట్టాలు మహిళల పేరిటే మంజూరు చేశామని చెప్పారు.

రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సామాజిక సమీకరణ ద్వారా 47.4లక్షల మంది మహిళలతో 4లక్షల 17వేల సమభావన సంఘాలను, రాష్ట్రవ్యాప్తంగా 18వేల గ్రామ సంఘాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ మహిళా సంఘాలు అద్భుత ప్రగతి సాధించాయని అభినందించారు.

ప్రపంచ బ్యాంకు నిధులతో తెలంగాణ రూరల్ ఇన్‌క్లూసివ్ గ్రోత్ ప్రాజెక్ట్(టిఆర్ఎల్ఈజి) ద్వారా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి పేదల జీవనోపాధి అవకాశాలను పెంపొందిస్తున్నట్లు కెటిఆర్ వెల్లడించారు. ఐవిఆర్ఎస్ టెక్నాలజీని వినియోగిస్తూ స్త్రీనిధి ద్వారా గ్రామీణ పేద మహిళలకు కావాల్సిన రుణాలను సకాలంలో తక్కువ వడ్డీకి అందిస్తున్నట్లు చెప్పారు. పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ సదస్సుకు 15 దేశాలకు చెందిన 30మంది ప్రతినిధులు హాజరయ్యారు.

కెటిఆర్

కెటిఆర్

మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు.

కెటిఆర్

కెటిఆర్

కేంద్ర విదేశీ వ్యవహరాలు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత-పేదరిక నిర్మూలన' అనే అంశంపై తాజ్‌కృష్ణ హోటల్‌లో మూడురోజులపాటు జరుగనున్న అంతర్జాతీయ సదస్సును మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.

కెటిఆర్

కెటిఆర్

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. గ్రామీణ మహిళల సాధికారత, సమస్యలు, వాటి పరిష్కారాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని, అందుకే తమ ప్రభుత్వం మహిళాభివృద్ధితోపాటు వారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

English summary
K. T. Rama Rao, Minister for PR & IT, Govt of Telangana is seen inaugurating the international workshop on women empowerment and poverty alleviation organised by indian ocean rim association (IORA) at hotel Taj Krishna, hyderabad on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X