టిలో అడోబ్, గూగుల్ స్ట్రీట్‌వ్యూ: కెటిఆర్(పిక్చర్స్)

వాషింగ్టన్: హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు అడోబ్, ఒరాకిల్ ఆసక్తి చూపాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారకరామారావు బృందం ఏడోరోజు సిలికాన్ వ్యాలీని సందర్శించింది. ఈ సందర్భంగా అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌ను మంత్రి కలిశారు.

తాను పక్కా హైదరాబాదీనని, హైదరాబాద్ కోసం కచ్చితంగా సహకారం అందచేస్తానని శంతనునారాయణ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి అడోబ్ కంపెనీ అధిపతిగా ఎదిగిన శంతను నారాయణ్ మంత్రి బృందాన్ని అభినందించారు. హైదరాబాద్ నగరం అభివృద్ధికి, తెలంగాణలో వ్యాపారాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కేటీఆర్ ఆయనకు వివరించారు.

హైదరాబాద్‌లో అడోబ్ కంపెనీ విస్తరణ చేపట్టాలన్న మంత్రి విజ్ఞప్తికి శంతను సానుకూలంగా స్పందించారు. తమ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్ తప్పకుండా ఉంటుందని ఆయన చెప్పారు. అనంతరం మంత్రి కేటీఆర్ బృందం ఒరాకిల్ సీఈఓ మార్క్‌ హడ్‌ను కలిసింది. తెలంగాణ రాష్ట్రంలో ఒరాకిల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలను విశదీకరించిన కేటీఆర్, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానం గురించి తెలిపారు.

హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ సంస్థలకు ఉన్న సానుకూలతలను తెలిపిన మంత్రి, ఒరాకిల్‌తో కలిసి పని చేసేందుకు అవకాశమున్న రంగాలపై కూడా మార్క్‌హడ్‌తో చర్చించారు. హైదరాబాద్ నగరంలోని డాటా సెంటర్లకు కల్పిస్తున్న రక్షణను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అభినందించిన ఒరాకిల్ కంపెనీ హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అసక్తి చూపింది.

అక్కడి నుంచి మంత్రి తారకరామారావు బృందం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల విభాగంలో ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రఖ్యాత బ్లూమ్ ఎనర్జీ సంస్థ సీఈఓ కేఆర్ శ్రీధర్‌తో సమావేశమైంది. సాంకేతిక ప్రపంచంలో విప్లవాత్మకమైన ఫ్యూయల్‌సెల్ సాంకేతిక పరిజ్ఞానం గురించి శ్రీధర్ మంత్రి బృందానికి వివరించారు.

అరచేయి విస్తీర్ణంలో ఉన్న ఒక్క ఫ్యూయల్ సెల్‌తో ఒక ఇల్లు మొత్తానికి అవసరమైన విద్యుత్‌ను అందించగలిగే ప్రత్యేకత బ్లూమ్ టెక్నాలజీ కంపెనీకుందని శ్రీధర్ తెలిపారు. తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, తమ రాష్ట్రంలో మాన్యూఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని మంత్రి కెటిఆర్.. శ్రీధర్‌ను కోరారు. త్వరలోనే హైదరాబాద్ నగరానికి వస్తానని, పెట్టుబడులకున్న అవకాశాలను పరిశీలిస్తానని శ్రీధర్ ఈ సందర్భంగా మంత్రికి హామీ ఇచ్చారు.

సాయంత్రం సమయంలో మంత్రి బృందం అరుబా నెట్‌వర్క్‌ను సందర్శించి ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులు కన్వల్ రేఖి, కీర్తి మెల్కోటేలను కలుసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి బృందం వారికి వివరించింది.

అరుబా నెట్‌వర్క్స్ ఈ మధ్యనే మూడు బిలియన్ డాలర్లకు హెచ్‌పీ కంపెనీని టేకోవర్ చేసిన విషయాన్ని వారు మంత్రికి వివరించారు. తెలంగాణ కోసం యాభై ఏళ్లకింద తమ తాత, మాజీ పార్లమెంట్ సభ్యుడు జీయస్ మెల్కోటే పోరాడారని, ఇప్పుడు ఆయన కల సాకరమైందని వారు తమ సంతోషాన్ని మంత్రితో పంచుకున్నారు.

కెటిఆర్

కెటిఆర్

అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారకరామారావు బృందం ఏడోరోజు సిలికాన్ వ్యాలీని సందర్శించింది. ఈ సందర్భంగా అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతనునారాయణ్‌ను మంత్రి కలిశారు.

కెటిఆర్

కెటిఆర్

అక్కడి నుంచి మంత్రి తారకరామారావు బృందం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల విభాగంలో ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రఖ్యాత బ్లూమ్ ఎనర్జీ సంస్థ సీఈఓ కేఆర్ శ్రీధర్‌తో సమావేశమైంది.

కెటిఆర్

కెటిఆర్

సాంకేతిక ప్రపంచంలో విప్లవాత్మకమైన ఫ్యూయల్‌సెల్ సాంకేతిక పరిజ్ఞానం గురించి శ్రీధర్ మంత్రి బృందానికి వివరించారు.

కెటిఆర్

కెటిఆర్

అరచేయి విస్తీర్ణంలో ఉన్న ఒక్క ఫ్యూయల్ సెల్‌తో ఒక ఇల్లు మొత్తానికి అవసరమైన విద్యుత్‌ను అందించగలిగే ప్రత్యేకత బ్లూమ్ టెక్నాలజీ కంపెనీకుందని శ్రీధర్ తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ సంస్థలకు ఉన్న సానుకూలతలను తెలిపిన మంత్రి, ఒరాకిల్‌తో కలిసి పని చేసేందుకు అవకాశమున్న రంగాలపై కూడా మార్క్‌హడ్‌తో చర్చించారు.

స్ట్రీట్ వ్యూపై గూగుల్ ప్రతినిధులతో మంత్రి భేటీ

హైదరాబాద్ స్ట్రీట్ వ్యూకు గూగుల్ కంపెనీ అంగీకారం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. గూగుల్ స్ట్రీట్‌వ్యూ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ మాణిక్‌గుప్తా, గ్రౌండ్ ట్రూత్ ఇంజినీరింగ్ హెడ్ నారాయణ తుమ్మల తదితరులను మంత్రి బృందం కలుసుకుంది.

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌కు ఈ అవకాశం కల్పించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ సాంకేతికకు ఒప్పుకోలేదనే విషయాన్ని గూగుల్ ప్రతినిధుల ప్రస్తావించగా, తాము దీనిపై కేంద్రంతో చర్చిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+