Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజకీయాల్లోకి అంటే జీన్స్ వేసినట్లు: రేపు కోదండ ఉద్యోగ విరమణ, కెసిఆర్‌పై ఎలా?

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం నాడు ఉద్యోగ విరణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన రాజకీయాల పైన అనాసక్తిని ప్రదర్శించారు.

తాను చివరి వరకు ఉద్యమకారుడిగానే ఉంటానని చెప్పారు. ప్రజా సమస్యల పైన పోరాడుతానని స్పష్టం చేశారు. తాను రాజకీయాలలోకి రావడం అంటే జాతిపిత మహాత్మా గాంధీకి జీన్స్ ప్యాంటు వేసినట్లు ఉంటుందని చెప్పారు.

కోదండరాం ఉద్యోగ విరమణ అనంతరం... తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎలా భాగస్వామి అవుతారు? ప్రజా సమస్యల పైన ఎలా స్పందిస్తారనే విషయమై ఇప్పటికే జోరుగా చర్చ సాగుతోంది. రైతు ఆత్మహత్యలతో పాటు పలు అంశాల పైన ఆయన కెసిఆర్ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.

Telangana JAC Chairman Kodandaram to retire on September 30

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ పాత్ర, కోదండరాం పాత్ర మరువలేనిది. టీఆర్ఎస్ అధినేతగా కెసిఆర్‌కు ఎదురు దెబ్బ తగిలినప్పుడల్లా... తెలంగాణ జేఏసీ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి ఊపిరూదింది. 2010 నుంచి ఉద్యమంలో కోదండ పాత్ర ఎంతో ఉంది.

కోదండరాం అసలు పేరు కోదండరాం రెడ్డి. కోదండరాంగా సుపరిచితుడు. వృత్తి రీత్యా ప్రొఫెసర్. 1955లో కరీంనగర్ జిల్లా ఊటూర్ గ్రామం కోదండరాం జన్మించారు. విద్య మొత్తం దాదాపుగా అంతా వరంగల్లోనే జరిగింది. వరంగల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలొ డిగ్రీ పూర్తవగానే రాజనీతి శాస్త్రంలో పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+