కర్ణాటక పరిణామాలు బాధ కల్గిస్తున్నాయి: కోదండరామ్
బెంగుళూరు: కన్నడనాట జరుగుతున్న రాజకీయాలు బాధకలిగిస్తున్నాయని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు.
కర్ణాటకలోని రాజకీయ సంక్షోభంపై తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు కోదండరామ్ వ్యాఖ్యానించారు
శనివారం నాడు ప్రోఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న గలీజు రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో సంస్కరణలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం టీజేఎస్ పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయ ప్రక్షాళన కోసమే తెలంగాణ జనసమితి ఆవిర్భవించిందన్నారు. కౌలు రైతులకు పెట్టుబడికై భూరికార్డుల్లోని అక్రమాలను నిరసిస్తూ ఈ నెలాఖరులో ఖమ్మం నుంచి సడక్ బంద్ చేపట్టనున్నట్టు కోదండరామ్ ప్రకటించారు.

కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్, జెడి(ఎస్) లు యడ్యూరప్పకు సీఎం పదవిని కట్టబెట్టడాన్ని నిరసిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో శనివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు విశ్వాస పరీక్ష జరగనుంది.
దేశ వ్యాప్తంగా ఈ విశ్వాస పరీక్షపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజకీయాల్లో మార్పును కోరుకొంటున్న తెలంగాణ జనసమితి ఈ తరహ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు కరీంనగర్ లో ఆ పార్టీ వ్యవస్థాపకులు కోదండరామ్ కన్నడ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.












Click it and Unblock the Notifications