మంత్రులకు కెసిఆర్ హెచ్చరికలు: కదిలిన మంత్రులు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏ మాత్రం మొహమాటం ప్రదర్శించబోనని ఆయన చెప్పారు దాంతో మంత్రుల్లో కదలిక వచ్చింది.
హైదరాబాద్: తన మంత్రివర్గ సహచరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో మంత్రుల్లో కదలిక వచ్చింది. ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగు కోసం ఇక నుంచి కఠినంగా వ్యవహరిస్తానని ఆయన హెచ్చరించారు. వారికి ఉపదేశం కూడా చేశారు.
మంత్రులంతా బడ్జెట్‌పై, శాఖలపై సమగ్రమైన అవగాహనను కలిగి ఉండాలని, ఇక మీదట ఏ మంత్రి విషయంలోనూ మొహమాటం ప్రదర్శించబోనని ఆయన చెప్పారు. గురువారం మంత్రివర్గ భేటీలో కెసిఆర్ ఆ హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలు పనిచేసినట్లే ఉన్నాయి. శుక్రవారం ఏకంగా ఆరుగురు మంత్రులు తమ శాఖలపై సమీక్షలు నిర్వహించారు. ఒకరిద్దరూ మంత్రులు తప్ప మిగతా వారంతా ఆలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా సంక్షేమరంగానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఆ శాఖలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు ఆశించినస్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దాంతో సంక్షేమంపై స్వయంగా పలు దశలుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించి, పకడ్బందీగా అమలు చేయలేకపోతే ప్రజల్లో వ్యత్రిరేకత ఏర్పడుతుందనే అభిప్రాయం ముఖ్యమంత్రికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే విషయంపై గురువారం వాడివేడిగా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది.ఈ సమావేశంలోనే ఆయన మంత్రలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బడ్జెట్ తయారీలో మంత్రులు చొరవను ప్రదర్శించేలా ఆయన చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications