తెలంగాణలో స్వీయ జనగణన మహాయజ్ఞానికి శ్రీకారం: ఒక్క క్లిక్ తో సెన్సస్ ఇలా సబ్మిట్

తెలంగాణలో ఓ మహాయజ్ఞానికి అడుగు ముందుకు పడింది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణ ప్రాంతం (క్యూర్‌) పరిధిలో 2027 స్వీయ జనగణన ఆరంభమైంది. మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ప్రక్రియలో.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే జనగణన యూనిట్‌గా పరిగణిస్తారు. ఈ 15 రోజుల వ్యవధిలో.. ఆయా మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల నివాసితులు తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

www.se.census.gov.in అనే అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వచ్ఛందంగా సమర్పించవచ్చు. ఈ ఉదయం గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా.. ఈ లాంఛనంగా ప్రారంభించారు. స్వీయ గణనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో మొదటగా తన పేరు నమోదు చేసుకున్న వ్యక్తి.. ఆయనే. ఈ కార్యక్రమానికి సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోలికేరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్, ఇతర అధికారులు హాజరయ్యారు.

Telangana Launches Self-Enumeration for Census 2027 Begin Your Online Now Be Part of Census

నగరంలో ప్రతి ఇంటిని లెక్కించేలా, పౌరులందరూ స్వయ గణనలో పాల్గొని, 2027 జనాభా లెక్కల కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సహకరించాలని ఈ సందర్బంగా గవర్నర్ శుక్లా, కమిషనర్ కర్ణన్ పిలుపునిచ్చారు. 2027 జనగణన దేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి డిజిటల్ సెన్సస్ అవుతుంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు ఇదే తొలి జనగణన కావడంతో పాటు ఇందులో కులం ఆధారిత గణన కూడా పొందుపరచనున్నారు.

ఆన్‌లైన్ దశ అనంతరం మే 11 నుండి జూన్ 9 వరకు ఇంటింటి సర్వే, గోడలపై గుర్తులు వేసే "హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (HLO)" నిర్వహిస్తారు. భారతి హొల్లికేరి, కర్ణన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పోర్టల్‌లో గృహాలు, ఆస్తులు, ఇంట్లో ఉండే సౌకర్యాలకు సంబంధించిన 33 ప్రశ్నలు ఉంటాయి. తెల్లవారు జామున 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు నివాసితులు లాగిన్ అవ్వవచ్చు. ఎలాంటి పత్రాలు అవసరం లేదు. ఈ ప్రక్రియకు 15-20 నిమిషాలు పడుతుందని అంచనా.

వివరాలను సమర్పించిన తర్వాత, కుటుంబాలకు స్వీయగణన ఐడీ వస్తుంది. ఆ వివరాలను ధృవీకరించడానికి జనాభా లెక్కింపు సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని తప్పనిసరిగా చూపాలి. టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1855 ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ గణన కోసం 21,866 సిబ్బంది, 3,662 మంది పర్యవేక్షకులను నియమిస్తారు. స్వీయగణన మహోత్సవ్ - 15 రోజులు పేరుతో అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+