"బీరు తాగడంలో తెలంగాణ దేశంలోనే నెం. 1"
మద్యం వినియోగంలో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. బీరు తాగడంలో రూరల్ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక సిగరెట్లు తాగే విషయంలో 5వ స్థానంలో ఉందని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ(NIPFP) సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఈ సమాచారాన్ని NIPFP సంస్థ తాజాగా రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలోని గ్రామాల్లో ఒక వ్యక్తి సగటున బీరు, విదేశీ మద్యం కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది. అలాగే మత్తు పదార్థాల వినియోగంలోనూ తెలంగాణ దేశంలోనే టాప్ స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ(NIPFP) సంస్థ కీలక విషయాలను వెల్లడించింది. మద్యం వాడకంలో దేశంలోనే తెలంగాణ నెం.1 స్థానంలో ఉన్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా బీరు తాగడంలో రూరల్ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని నివేదికలో తేలిందని పేర్కొంది. ఈ మేరకు 2011-12 నుంచి 2022-23 సంవత్సరాలకు సంబంధించిన వివరాలను రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని గ్రామాల్లో ఒక వ్యక్తి సగటున బీరు, విదేశీ మద్యం కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ఇది దేశ సగటు రూ.486 తో పోలిస్తే ఆరు రెట్లు అధికం అని స్పష్టం చేసింది. అలాగే తెలంగాణలో మద్యం ఖర్చు 2014-15లో రూ.745 ఉండగా అది కాస్తా 2022-23లో రూ.1,623కు పెరిగినట్లు తెలిపింది.

ఇక ధూమపానం విషయంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని NIPFP పేర్కొంది. ఇక పట్టణాల్లో ఉన్న ధనవంతులు సిగరెట్లు, బీరు అధికంగా తీసుకుంటున్నారని.. అలాగే పలెల్లో తక్కువ, మధ్య ఆదాయం ఉన్నవారు పొగాకు, సిగరెట్లు ఎక్కువగా వాడుతున్నారని స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో మద్యం, పొగాకు కోసం చేసే ఖర్చు దేశంలోని అనేక రాష్ట్రాల కంటే అధికంగా ఉన్నట్లు వివరించింది.












Click it and Unblock the Notifications