తెలంగాణ బతుకమ్మకు గిన్నిస్ రికార్డ్‌ను అడ్డుకున్న వర్షం, మళ్లీ ఎప్పుడంటే!
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మకు గిన్నిస్ రికార్డ్ మిస్సయింది. భారీ వర్షం కారణంగా గురువారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ సంబరాలు గిన్నిస్‌లోకి ఎక్కకుండా పోయింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మకు గిన్నిస్ రికార్డ్ మిస్సయింది. భారీ వర్షం కారణంగా గురువారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ సంబరాలు గిన్నిస్‌లోకి ఎక్కకుండా పోయింది.
ఉదయం పది గంటల నుంచి సద్దుల బతుకమ్మ ఉత్సవం ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియంలో మూడు వేల మంది మహిళలతో సద్దుల బతుకమ్మ ప్రారంభమైంది. గిన్నిస్ వరల్ట్ రికార్డుల్లోకి ఎక్కేలా ప్లాన్ చేశారు.

మహిళలు తంగేడు పూల ఆకృతిలో చేరి..
ఇందుకోసం 300 మంది టీం లీడర్ల ఆధ్వర్యంలో కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపాలని భావించారు. పది గంటలకు ప్రారంభమైన ఉత్సవం.. ఆ తర్వాత మహిళలు తంగేడు పూల ఆకృతిలో చేరి మరింత ఆకర్షణీయంగా కనిపించారు.

పసుపు, ఆకుపచ్చని చీరల్లో వచ్చిన మహిళలు
బతుకమ్మ పూలతో తివాచీ ఏర్పాటు చేశారు. ఇందుకోసం మహిళలు ప్రత్యేకంగా పసుపు పచ్చని చీరలు, ఆకుపచ్చని చీరలతో స్టేడియానికి చేరుకున్నారు. అయితే అనుకోని విధంగా హైదరాబాదులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అనుకున్న విధంగా బతుకమ్మ ఫీట్ చేయలేకపోయారు. దీంతో గిన్నిస్ ప్రస్తుతానికి మిస్సయింది.

గిన్నిస్ రికార్డ్ వర్షం వల్ల ఆగింది
దీనిపై కార్యక్రమ నిర్వాహకులు బుర్రా వెంకటేషం మాట్లాడారు. వర్షం వల్ల గిన్నిస్ రికార్డు చేయలేకపోయామని చెప్పారు. అటెంప్ట్ మాత్రమే ఫెయిలయిందని, కచ్చితంగా రికార్డ్ మాత్రం నెలకొల్పుతామన్నారు. వీలైతే నవంబర్ నెలలోపు మరోసారి బతుకమ్మ గిన్నిస్ రికార్డు నెలకొల్పుతామని చెప్పారు.

నెక్స్ట్ టైమ్ బెట్టర్ లక్ అని గిన్నిస్ ప్రతినిధులు
ఎల్బీ స్టేడియానికి గిన్నిస్ బుక్ ప్రతినిధులు వచ్చారు. గిన్నిస్ రికార్డ్ అధికారి స్వప్నిల్ మాట్లాడుతూ.. మహా బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ ఈసారి మిస్సయిందని, వచ్చేసారి బెట్టర్ లక్ అని చెప్పారు.

30 వరుసల్లో.. కానీ వర్షం వల్ల ఆగిపోయింది
తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ. ఈ బతుకమ్మను గిన్నిస్‌కు ఎక్కించాలనుకున్నారు. మూడు వేల మంది మహిళల కోసం ఎల్బీ స్టేడియంలో 30 వరుసలు ఏర్పాటు చేశారు. అందరూ వచ్చారు. కానీ వర్షం అడ్డుకుంది. స్టేడియం అంతా వర్షంతో నిండిపోయింది. చిత్తడిగా మారింది. ఆడేందుకు వీలులేకుండా పోయింది.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications