Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Poll Management: పోల్ మేనేజ్‍మెంట్‍పై దృష్టి సారించిన అభ్యర్థులు.. ఓటుకు రూ.5 వేల వరకు పంపిణీ..!

రాష్ట్రంలో మంగళవారంతో ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పోల్ మేనేజ్‍మెంట్ పై దృష్టి సారించారు. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు గ్రామాల్లోకి డబ్బు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, గెలుపు అవకాశాల ఆధారంగా డబ్బు పంపిణీ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనరల్ అభ్యర్థుల నియోజకవర్గాల్లో భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, వేములవాడ, మునుగోడుతో పాటు పలు నియోజకవర్గాల్లో భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొన్ని చోట్ల ఓటుకు రూ.5000 వరకు కూడా ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక చాలా చోట్ల ఓటు రూ. 2000 నుంచి రూ.3000 వరకు ఇస్తున్నారని తెలుస్తోంది. డబ్బుతో పాటు మద్యం పంపిణీ కూడా భారీగానే జరుగుతోంది. కొని నియోజకవర్గాల్లోనే అభ్యర్థులు దాదాపు లక్ష మంది ఓటర్లకు డబ్బు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఎన్నికల అధికారులు, పోలీసులు నామమాత్రమేంగానే మిగిలిపోయారనే వార్తలు వస్తున్నాయి.

Telangana main party candidates focused on poll management

ప్రచారం కంటే పోల్ మేనేజ్ మెంట్ ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ అభ్యర్థులకు పోల్ మేనేజ్ మెంట్ చేయడానికి కాస్త సులభంగా ఉంటుందని వివరిస్తున్నారు. అయితే చాలా మంది అభ్యర్థులు డబ్బులు పంచిన తర్వాత వారితో ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఓటుకు రూ.5000 చొప్పున పంపిణీ ప్రారంభించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో భారీగా డబ్బులు పంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డబ్బుల పంపిణీ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. ఏ చిన్న సమాచారం వచ్చినా వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ నామమాత్రపు తనిఖీలేనని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎన్నికలు దేశంలోనే ఖరీదైన ఎన్నికలుగా మారే అవకాశం ఉందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+