హైదరాబాద్ కేపీహెచ్‌బీ శివ‌పార్వ‌తి సినిమా హాల్‌లో అగ్నిప్రమాదం: థియేటర్ బుగ్గి

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్న శివపార్వతి థియేటర్‌లో ఈ తెల్లవారు జామున మంటలు అంటుకున్నాయి. థియేటర్ మొత్తం తగులబడింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఈ ఘోర అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఆస్తినష్టం మాత్రం భారీగా సంభవించింది. కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించి ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
దీనిపై స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు. మంటలు చెలరేగిన సమయంలో థియేటర్‌లో ఎవరూ లేరు. ఫలితంగా ప్రాణాపాయం తప్పింది.

Telangana: Major Fire broke out at Shiva Parvathi cinema hall in Kukatpally, Hyderabad

మంటలు చెలరేగిన సమయంలో థియేటర్‌ లోపల ఎవరూ లేరు. ఆవరణలో కొంతమంది సిబ్బంది ఉన్నారు. వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సినిమాను ప్రదర్శించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుని ఉండి ఉంటే.. భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండేదనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. శివపార్వతి థియేటర్‌లో నాని-సాయిపల్లవి జంటగా నటించిన శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా ప్రదర్శితమౌతోంది.

సెకెండ్ షో ముగిసిన తరువాత కూడా ఎలాంటి ప్రమాద సంకేతాలు అందలేదు. తెల్లవారు జామున షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. దాన్ని ఎవరూ గమనించకపోవడం వల్ల అగ్నికీలలు థియేటర్ మొత్తం వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు. అగ్నికీలల ధాటికి థియేటర్‌ స్ర్కీన్, కుర్చీలు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. దాదాపు కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

నెల రోజుల వ్యవధిలో థియేటర్లలో అగ్నిప్రమాదాలు సంభవించడం ఇది మూడోసారి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా విడుదలైన రెండు సినిమా హాళ్లల్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. వరంగల్‌, శ్రీకాకుళం జిల్లాల్లోని థియేటర్లల్లో మంటలు చెలరేగాయి. నాటి ఘటనల్లోనూ ప్రాణాపాయం తప్పింది గానీ, ఆస్తి నష్టం సంభవించింది. నెలరోజుల వ్యవధిలో శివపార్వతి థియేటర్‌లో ఇదే తరహా సంఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. థియేటర్లలో ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+