గులాబీ నుండి తెలుపుకు మారిన టీఎమ్‌యూ జెండా
తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ అనుబంధ విభాగం తన జెండా రంగును మార్చుకుంది. ఇప్పటి వరకు ఉన్న గులాబి రంగును తొలగించి తెల్లరంగు జెండాను అవిష్కరించేందుకు సిద్దమైంది. నేడు జరిగిన టీఎమ్‌యూ అవిర్భావ దినోత్సవ వేడుకల్లో మారిన జెండాతో ఎగరవేశారు. దీంతో ప్రభుత్వంపై మరింత పోరాటాన్ని ఉదృతం చేసేందుకు కార్మికులు సిద్దవుతున్నారు.
తెలంగాణ మజ్దూర్ యూనియన్ తన జెండా రంగును మార్చుకుంది. నేటి వరకు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీఎంయూ గులాబీ రంగు జెండాలో ఉండేది. ప్రస్తుతం ఆర్టీలో జరుగుతున్న పరిణామాలతో యూనియన్ నాయకులకు మరియు ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది. దీంతో ఆర్టీసీని విలీనం చేసే డిమాండ్ పై కార్మికులు పోరాటం చేస్తున్న నేపథ్యంలో పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది.

దీంతో ప్రభుత్వ అనుబంధ సంఘంగా ఉండడం వల్ల కార్మికులకు ఒరిగేదేమీ ఉండదనే యోచనలో కార్మిక సంఘం ఉన్నట్టుంది. దీంతో నేడు జరగిన ఆవిర్భావదినోత్సంలో పార్టీ తెల్లరంగుతోపాటు జెండా మధ్యలో ఉన్న బాణం గుర్తు గల జెండాను అవిష్కరించేందుకు సిద్దమయ్యారు.
సంఘం ఏర్పాటు నుండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఉద్యమంలో బాగంగా పలు ఆర్టీసీ సంఘాలు ముందుకు వచ్చి సకల జనుల సమ్మెకు నాందిపలికాయి. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఖరితో మజ్దుర్ యూనియన్ స్వతంత్ర సంఘంగా వ్యవహరించనుంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications