Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ ‘బాద్‌షా’ కెటిఆర్: రామ్మోహన్‌కు నారాయణమూర్తి అభినందనలు(పిక్చర్స్)

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి టిఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ పీఠం దక్కించుకునేలా చేసిన ఐటి, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావును పార్టీ కార్యకర్తలు ‘హైదరాబాద్ బాద్‌షా' చిత్రీకరిస్తూ పలు ఫ్లెక్సీలను నగర కూడళ్లలో ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఫ్లెక్సీలను ఆకట్టుకునేలా ఉన్నాయి.

కాగా, హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికైన బొంతు రామ్మోహన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి.. రామ్మోహన్‌కు అభినందనలు తెలిపారు.

మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా బొంతు రామ్మోహన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌కు డిప్యూటీ సీఎం మహముద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అభినందనలు తెలిపారు. ఉద్యమంలో చూపించిన ఉత్సాహం పనిలోను చూపిస్తానని రామ్మోహన్ తెలిపారు. జీహెచ్‌ఎంసీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

కార్పొరేటర్ల ప్రమాణం

కార్పొరేటర్ల ప్రమాణం

పాలకుడిగా కాకుండా ప్రజలకు సేవకుడిగా ఉంటానని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు.

కార్పొరేటర్లు

కార్పొరేటర్లు

గతంలో సమగ్ర కుటుంబ సర్వే, స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాల ద్వారా నగరంలోని సమస్యలను తెలుసుకోగలిగామని అన్నారు. ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు తగిన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

కార్పొరేటర్లు

కార్పొరేటర్లు

మేయర్‌గా ఎన్నికైన అనంతరం బొంతు రామ్మోహన్ గురువారం మీడియాతో మాట్లాడారు.

కార్పొరేటర్లు

కార్పొరేటర్లు

నగరం పెరిగినప్పటికీ దానికి అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి సక్రమంగా చేపట్టలేదని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. దీన్ని అమలు చేసేందుకు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.

కార్పొరేటర్

కార్పొరేటర్

ప్రతి ఇంటికి నల్లా నీరు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. గత 50 ఏళ్లుగా నగరాన్ని సక్రమంగా అభివృద్ధి చేయలేదని అన్నారు. ఇప్పుడిప్పుడే అనేక కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. వీటికి ఆకర్షితులై గూగుల్‌, ఉబర్‌తోపాటు పెద్దపెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు మందుకు వస్తున్నాయని పేర్కొన్నారు.

కార్పొరేటర్లు

కార్పొరేటర్లు

ఇందుకు అసవరమైన మౌలిక వసతులను కల్పించేందుకు అధికారులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.

కార్పొరేటర్లు

కార్పొరేటర్లు

అవినీతి రహిత పాలనను సాగించి ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని తెలిపారు.

కార్పొరేటర్లు

కార్పొరేటర్లు

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

కార్పొరేటర్లు

కార్పొరేటర్లు

నగరాభివృద్దికి ప్రణాళికలు సిద్ధం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు.

కార్పొరేటర్లు

కార్పొరేటర్లు

14 ఏళ్ల నుంచి ఉద్యమాల్లో వెన్నంటి ఉన్నానని పేర్కొన్నారు. దీని ఫలితంగానే తనకు పదవి దక్కిందని స్పష్టం చేశారు.

కార్పొరేటర్లు

కార్పొరేటర్లు



పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు తప్పకుండా అవకాశాలు వస్తాయని, ఇందుకు తాను ఒక ఉదాహరణ అని తెలిపారు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు.

హైదరాబాద్ బాద్ షా కెటిఆర్

హైదరాబాద్ బాద్ షా కెటిఆర్

గ్రేటర్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి టిఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ పీఠం క్కించుకునేలా చేసిన ఐటి, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావును పార్టీ కార్యకర్తలు ‘హైదరాబాద్ బాద్‌షా' చిత్రీకరిస్తూ పలు ఫ్లెక్సీలను నగర కూడళ్లలో ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఫ్లెక్సీలను ఆకట్టుకునేలా ఉన్నాయి.

అభినందనలు

అభినందనలు

మేయర్, డిప్యూటీ మేయర్లకు అభినందనలు తెలుపుతున్న తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య.

ఆర్ నారాయణ మూర్తి అభినందనలు

ఆర్ నారాయణ మూర్తి అభినందనలు

హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికైన బొంతు రామ్మోహన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి.. రామ్మోహన్‌కు అభినందనలు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+