హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ మహిళకు సాయం చేయాలంటూ డీకే శివకుమార్ ట్వీట్: కేటీఆర్ రెస్పాన్స్, ప్రాబ్లమ్ సాల్వ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యాకు చెందిన మహిళ కుటుంబానికి సాయమందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. మాండ్యాకు చెందిన శశికళ అనే మహిళ భర్త హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారని, ఆస్పత్రి యాజమాన్యం రూ. 7.5 లక్షల బిల్లు వేసినట్లు డీకే శివకుమార్.. కేసీఆర్, కేటీఆర్‌ల దృష్టికి తీసుకొచ్చారు.

రూ. 2 లక్షలు చెల్లిస్తామన్నా మృతదేహాన్ని అప్పగించలేదని డీకే శివకుమార్ తెలిపారు. ఈ క్రమంలో శివకుమార్ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాధితురాలి వివరాలు తెలియజేయాల్సిందిగా శివకుమార్‌ను కోరారు. మహిళ, ఆస్పత్రి బిల్లు వివరాలు తెలుసుకోవాలని తన సిబ్బందిని కేటీఆర్ ఆదేశించారు. ఆ తర్వాత సమస్య పరిష్కారమైందని కేటీఆర్ కార్యాలయం ట్విట్టర్ ద్వారా డీకే శివకుమార్‌కు వెల్లడించింది.

తెలంగాణలో మరో ఏడు మెడికల్ కాలేజీలు

 Telangana minister KTR responded on DK Shivakumar request tweet: problem solved

ఆదివారం జరిగిన తెలంగాణ కేబినెట్ మీటింగ్‌లో లాక్‌డౌన్ అంశంతో పాటుగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో ఏడు మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్‌ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. మ‌హ‌బూబాబాద్‌, జ‌గిత్యాల‌, సంగారెడ్డి, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, కొత్త‌గూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు.

Recommended Video

PVNR Express Flyover ర్యాంపుల‌ను ప్రారంభించిన KTR | PVNR Expressway

ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ‌కు కేవలం నాలుగు మెడిక‌ల్ కాలేజీలు ఉన్నాయ‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాడ్డాక కేసీఆర్ ప్ర‌భుత్వంలో 5 కళాశాల‌లు ఏర్పాటు చేసినట్లు వివ‌రించారు. మ‌రో ఏడు వైద్య‌ క‌ళాశాల‌లు అందుబాటులోకి రానున్నాయ‌ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

English summary
Telangana minister KTR responded on DK Shivakumar request tweet: problem solved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X