మెట్రో రైలు: తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల తొలి ప్రయాణం..

ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం జరగనుంది.

హైదరాబాద్: భాగ్యనగరవాసులకు శుభవార్త! ఎప్పుడెప్పుడు మెట్రో రైలులో ప్రయాణిద్దామా అని ఎదురుచూస్తున్న నగర వాసుల కోరిక తీరే సమయం ఇంకెంతో దూరం లేదు. ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం జరగనుంది.

ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ రాష్ట్ర మంత్రులు, హైదరాబాద్ నగరానికి చెందిన వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు మెట్రో ట్రయల్ రన్ జర్నీలో ప్రయాణించారు.

Telangana Ministers, MLAs First Journey in Hyderabad Metro Rail

నాగోలు నుంచి మెట్టుగూడ వరకు జరిగిన ఈ మెట్రో రైలు ప్రయాణం అనంతరం ప్రజాప్రతినిధులు తిరిగి అదే రైలులో నాగోలుకి చేరుకున్నారు. నాగోలులో మెట్రో స్టేషన్ వద్ద ప్రజాప్రతినిధులకి మెట్రో రైలు ప్రయాణం, టికెట్ల కొనుగోలు, నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు అక్కడి ఉన్నతాధికారులు.

ఈ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో మెట్రో రైలు స్టేషన్లలో సుందరీకరణ పనులని కూడా పరిశీలించారు మంత్రి కేటీఆర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+