బీజేపీ, జనసేనకు ప్రతిష్ఠాత్మక ఎన్నిక- టీడీపీ మద్దతు ఎవరికి..!?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో జరిగే ఎమ్మెల్యే ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. తెలంగాణలో బలోపేతం దిశగా పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర పార్టీల కంటే ముందే తమ ఎమ్మెల్సీ అభ్యర్ధిని ప్రకటించారు. ఇక్కడ తమకు ఎవరితో పొత్తు లేదని ప్రకటించిన బీజేపీ.. బరిలో నిలిచింది. కాగా, ఏపీలో ఈ రెండు పార్టీలతో జత కట్టిన టీడీపీ.. ఇప్పుడు తెలంగాణలో ఎవరికి మద్దతు ఇస్తుందనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.
తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గం ఎన్నికపై ఎన్డీయే కూటమిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో కూటమిగా మూడు పార్టీలు పొత్తుతో కొనసాగుతున్నాయి. తెలంగాణలో మాత్రం ఈ పార్టీల మధ్య పొత్తు లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సి స్థానాన్ని దక్కించుకోవాలని జనసేన భావిస్తోంది. అందులో భాగంగా తమ పార్టీ తరఫున గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించారు.

అదే విధంగా బీజేపీ కి సైతం ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. అభ్యర్ధిని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. ఇక.. తమకు తెలంగాణలో ఎవరితో పొత్తు ఉండదని బీజేపీ ఇప్పటికే తేల్చి చెప్పింది. దీంతో.. ఎన్డీఏ లో భాగస్వాములుగా ఉన్న పార్టీలు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రత్యర్థులుగా బరిలో నిలిచాయి. కాగా.. టీడీపీ మాత్రం ఈ ఎన్నికలో పోటీ చేయటం లేదు. అయితే... టీడీపీ కేడర్ మాత్రం ఎవరికి మద్దతుగా నిలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.
వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం లేదు. అధికారికంగా రెండు పార్టీల్లో ఎవరికీ మద్దతు ఇవ్వాలనేది చెప్పే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. తటస్థ వైఖరితోనే ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్ది ప్రకటన.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక ల్లోనూ పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు. అదే విధంగా తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అందులో భాగంగా పవన్ పార్టీ పోటీ చేయటం ద్వారా ఏ మేర ప్రభావం ఉంటుందనేది తెలంగాణ పార్టీల్లో కీలకంగా మారుతోంది. సీఎం రేవంత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. అటు కేసీఆర్ సైతం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. బీజేపీకి గ్రాడ్యుయేట్ సీటు లో గెలుపు వచ్చే ఎన్నికల వేళ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. దీంతో.. టీడీపీ కేడర్ ఎవరి వైపు నిలుస్తుంది... ఫలితం ఏంటనేది ఇప్పుడు రాజకీయం గా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారుతోంది.














Click it and Unblock the Notifications
