పెట్రోల్, గ్యాస్ ధరలు ఇంకా పెంచడానికే ఓటేయాలా? -బీజేపీపై మంత్రి హరీశ్ రావు ఫైర్
తెలంగాణలో గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఇంధన ధరల భగభగలు ప్రచారాస్త్రాలుగా మారాయి. రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను ప్రస్తావిస్తూ... వాటిని ఇంకాస్త పెంచడానికే బీజేపీకి ఓటేయమంటారా? అని టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా చేర్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు బీజేపీపై నిప్పులు చెరిగారు. నోరుంది కదాని తెలంగాణ బీజేపీ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారని, వాళ్లకు నిజంగా దమ్ముంటే, చేతనయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో మాట్లాడాలని సవాలు విసిరారు.

కేంద్రంలోని మోదీ సర్కారు వరుసగా ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతూ, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని, ఇప్పటికే బీఎస్ఎన్ ఎల్, రైల్వే, ఎల్ఐసీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ''ఈతోటి బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపింది. అసలు వీళ్లకు ఓటెందుకు వేయాలి? ఉద్యోగాలు ఊడగొట్టినందుకా? లీటరు పెట్రోల్ రూ.100 చేసినందుకా? గ్యాస్, పెట్రోల్, డిజీల్ ధరలు ఇంకా పెంచడానికా?'' అని నిలదీశారు.
ఓవైపు ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతూ, నిత్యావసర ధరల్ని ఇష్టారీతిగా పెంచేస్తోన్న బీజేపీ సర్కారు ఇక ఎరువుల ధర కూడా పెంచబోతోందని, యాసంగి నాటికే ఎరువుల ధర పెంచాలని కేంద్రం డిసైడైందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ జిల్లాల గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లొచ్చారని, రాష్ట్రం కోసం కృషి చేశారని మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు.
-
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..! -
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే? -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications